News April 22, 2025

నిర్మల్: ‘అమ్మానాన్న కష్టం చూడలేక ఆర్మీ జాబ్ కొట్టాడు’

image

బైంసా మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన సాకేత్ మొదటి ప్రయత్నంలోనే ఆర్మీ ఫలితాల్లో ఉద్యోగం సాధించాడు. తల్లిదండ్రులు వ్యవసాయం, కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. తన అమ్మానాన్నల కష్టాన్ని చూసి ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే కృషితో పట్టుదలతో మొదటి ప్రయత్నంలోనే ఆర్మీ ఉద్యోగం సాధించాడు. కానిస్టేబుల్ కృష్ణ చౌహాన్‌ను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని ఉద్యోగం పొందానని తెలిపాడు. అతడినిని పలువురు అభినందించారు.

Similar News

News January 4, 2026

మార్కాపురం జిల్లాలో మొదటిసారి పరిష్కార వేదిక

image

మార్కాపురం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ రాజాబాబు శనివారం తెలిపారు. మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం, కనిగిరి నియోజకవర్గ ప్రజలు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మార్కాపురం జిల్లాకు సంబంధించిన అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారన్నారు. 5వ తేదీ జరగవలసిన రెవెన్యూ క్లినిక్ వాయిదా వేశామన్నారు.

News January 4, 2026

వెనిజులాలోని భారతీయులకు MEA హెచ్చరిక

image

వెనిజులాలో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో భారతీయులకు భారత విదేశీ వ్యవహారాల శాఖ హెచ్చరికలు చేసింది. అత్యవసరం కాకపోతే ఆ దేశానికి ప్రయాణాలు మానుకోవాలంది. ఇప్పటికే వెనిజులాలో ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని, బయట తిరగొద్దని కోరింది. సాయం కావాల్సినవారు cons.caracas@mea.gov.in, అత్యవసర ఫోన్/వాట్సాప్ నంబరు(58-412-9584288)ను సంప్రదించాలంది. భారతీయులందరూ కరాకస్‌లోని ఎంబసీతో టచ్‌లో ఉండాలని విన్నవించింది.

News January 4, 2026

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.