News April 22, 2025
నేషనల్స్‌లో మంచిర్యాల వాసికి గోల్డ్ మెడల్

బెల్లంపల్లికి చెందిన సింగరేణి క్రీడాకారుడు శ్రీనివాసచారి నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించి సత్తా చాటారు. హిమాచల్‌ప్రదేశ్‌లో ఈనెల 20 నుంచి 22 వరకు జరుగుతున్న నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ 55ఏళ్ల విభాగం పోటీలో పాల్గొని హై జంప్‌లో గోల్డ్ మెడల్ సాధించాడు. గోల్డ్ మెడల్ సాధించడంపై మందమర్రి సింగరేణి వర్క్‌షాప్ సహచర మిత్రులు హర్షం వ్యక్తం చేశారు. మరిన్ని పథకాలు సాధించాలని ఆకాంక్షించారు.
Similar News
News January 12, 2026
ఢిల్లీపై గుజరాత్ సూపర్ విక్టరీ

WPL-2026: ఢిల్లీతో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచులో గుజరాత్ విజయం సాధించింది. 210 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ 205 రన్స్ చేసింది. చివరి ఓవర్లో DC 7 పరుగులు చేయాల్సి ఉండగా సోఫీ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అద్భుతంగా బౌలింగ్ చేసి రెండు వికెట్లు తీసి 2 రన్స్ మాత్రమే ఇచ్చారు. 18, 19వ ఓవర్లలో జెమీమా సేన 41 రన్స్ చేసినా ప్రయోజనం లేకపోయింది. ఇది గుజరాత్‌కు రెండో విజయం.
News January 12, 2026
అనంతపురం శిల్పారామంలో 14న సంక్రాంతి సంబరాలు

అనంతపురంలోని శిల్పారామంలో ఈ నెల 14 నుంచి 16 వరకు సంక్రాంతి సంబరాలను నిర్వహిస్తున్నట్లు పరిపాలన అధికారి పి.శివ ప్రసాద్ రెడ్డి ఆదివారం తెలిపారు. సంస్కృతీ సంప్రదాయాల సమాహారం శిల్పారామం అన్నారు. సంక్రాంతి పండగను పురస్కరించుకొని విభిన్నమైన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. 3 రోజులు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7:30 వరకు సంబరాలను నిర్వహిస్తామన్నారు.
News January 12, 2026
నల్గొండ జిల్లాలో ఈరోజు టాప్ న్యూస్

చెరువుగట్టులో పాలకమండలి లేక భక్తుల ఇబ్బందులు
కట్టంగూరు: అటవీ భూముల్లో మట్టి అక్రమ తరలింపు
చిట్యాల: హైవే డివైడర్ మధ్యలో మంటలు
చిట్యాల: దాబా ముసుగులో డ్రగ్స్ దందా
నల్గొండ: లక్ష్యానికి దూరంగా మీనం
నల్గొండ : ఏసీబీలో లీక్ వీరులు
కట్టంగూరు: పండుగ పూట ప్రయాణ కష్టాలు
నల్గొండ: కార్పొరేషన్.. గెజిట్ కోసం నీరిక్షణ
నల్గొండ: కార్పొరేషన్‌గా మారితే.. వీరికి లాభమే


