News April 22, 2025
పెద్దపల్లి: ఈనెల 30లోపు రాజీవ్ యువ వికాసం వెరిఫికేషన్ పూర్తి: కలెక్టర్

ఈనెల 30 లోపు రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తిచేయాలని కలెక్టర్ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ఆయన రివ్యూ సమావేశం నిర్వహించారు. నిరుద్యోగులు ఆత్మగౌరవంతో జీవించేలా ఈ పథకాన్ని రూపొందించామని పేర్కొన్నారు. గ్రామాల వారీగా లక్ష్యాల కేటాయింపు ప్రక్రియ ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయాలని సూచించారు. DRDO కాలిందిని, లీడ్ బ్యాంకు మేనేజర్ వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News April 22, 2025
MHBD: తేలనున్న 9,317 మంది విద్యార్థుల భవితవ్యం!

MHBD జిల్లాలో ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరాల్లో ఈ ఏడాది 9,317 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మంగళవారం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. మొదటి సంవత్సరం జనరల్‌లో 3,196 మంది, ఒకేషనల్ 1199, ద్వితీయ సంవత్సరం జనరల్-3,716, ఒకేషనల్-1,206 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలను వేగంగా Way2News యాప్‌లో చూసుకోవచ్చు.
News April 22, 2025
కొత్తపల్లి చెరువులో దొరికిన మృతదేహం వివరాలు లభ్యం

కరీంనగర్ కొత్తపల్లి హవేలీ చెరువులో యువకుడి మృతదేహం కనిపించిన విషయం తెలిసిందే. మృతి చెందిన వ్యక్తి భార్గవ్‌గా పోలీసులు గుర్తించారు. భార్గవ్ తల్లిదండ్రులు కొత్తపల్లికి చెందిన పబ్బోజు నాగరాజు యాదలక్ష్మి కొద్ది రోజుల క్రితం మృతి చెందారు. ఈ క్రమంలో కొత్తపెళ్లి చెరువు వద్ద మృతదేహం లభించడంతో ఆత్మహత్య చేసుకున్నాడా లేక ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
News April 22, 2025
ఖమ్మం జిల్లా జైలులో పనికిరాని ఇనుప సామగ్రి వేలం

పనికిరాని ఇనుప సామగ్రిని ప్రజల సమక్షంలో బహిరంగ వేలం వేస్తున్నట్టు ఖమ్మం జిల్లా జైలు సూపరింటెండెంట్ శ్రీధర్ తెలిపారు. జైలులోని ఫ్యాక్టరీ స్క్రాప్‌ను ఈనెల 25న వేలం నిర్వహిస్తున్నామని, ఆసక్తిగలవారు రూ.5వేలు కనీస ధరావత్తు చెల్లించి వేలంలో పాల్గొనాలని కోరారు. మరింత సమాచారం కొరకు జిల్లా జైలర్లు సక్రునాయక్ (94946 32552), లక్ష్మీ నారాయణ(97005 05151)ను సంప్రదించాలని తెలిపారు.