News March 28, 2024

జాక్‌పాట్: లాటరీలో రూ.9,400 కోట్లు గెలిచాడు..

image

అమెరికా లాటరీలో ఓ వ్యక్తికి జాక్‌పాట్‌ తగిలింది. ఏకంగా రూ.9,400 కోట్లు గెల్చుకుని రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యారు. మెగా మిలియన్స్ అనే లాటరీ గేమ్‌లో మంగళవారం డ్రా తీశారు. అందులో ఒక వ్యక్తి ఆ మొత్తం గెల్చుకున్నారని గేమ్ అధికారులు తెలిపారు. అయితే అతడి పేరు వెల్లడించలేదు. కాగా జాక్‌పాట్ చరిత్రలో ఇది ఐదో అతిపెద్ద లాటరీ. విజేత మొత్తం డబ్బును ఒకేసారి లేదా 29 వార్షిక వాయిదాలలో పొందే అవకాశం ఉంది.

Similar News

News January 12, 2026

పంట అవశేషాలను కాల్చడం వల్ల కలిగే నష్టాలు

image

పంట అవశేషాలను కాల్చితే నేలలో కార్బన్ శాతం తగ్గిపోతుంది. నేల ఉపరితలం నుంచి 1cm లోపలి వరకు ఉష్ణోగ్రత 8 డిగ్రీలు పెరిగి నేలలో పంటకు మేలు చేసే బాక్టీరియా, ఫంగస్ నాశనమవుతాయి. వీటిని కాల్చేటప్పుడు వెలువడే కార్బన్ డై ఆక్సైడ్, మిథేన్, నైట్రస్ ఆక్సైడ్ వల్ల వాతావరణం వేడెక్కుతుంది. ఒక టన్ను పంట వ్యర్థాలను కాల్చడం వల్ల నేల ఉపరితలంలో 5.5kgల నత్రజని, 2kgల భాస్వరం, 2.5kgల పొటాష్, 1kg సేంద్రియ కర్బనం నష్టపోతాం.

News January 12, 2026

నేడు వెనిజులా.. రేపు ఇరాన్.. తర్వాత..?

image

ఒక దేశాధ్యక్షుడిని అపహరించి, ట్రంప్ తానే వెనిజులాకు రాజునని ప్రకటించుకోవడం మధ్యయుగాల నాటి మొండితనాన్ని సూచిస్తోంది. ప్రజాస్వామ్యం కావాలనుకుంటే ఎన్నికలు నిర్వహించాలి కానీ, సద్దాం హుస్సేన్ ఉదంతంలా చమురు కోసం ఇలా దాడులు చేయడం సరికాదు. నేడు వెనిజులా, రేపు ఇరాన్, తర్వాత మరోటి. ఇలా అగ్రరాజ్య ఆధిపత్య ధోరణి ప్రపంచ శాంతికి ముప్పుగా మారుతోందన్నది సామాన్యుడి అభిప్రాయం. మరి దీనిపై మీ Comment..

News January 12, 2026

సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

image

సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (<>STPI<<>>)లో 24 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. టెక్నికల్ స్టాఫ్, టెక్నికల్ సపోర్ట్ స్టాఫ్, అసిస్టెంట్, ఆఫీస్ అటెండెంట్ పోస్టులు ఉన్నాయి. ఉద్యోగాన్ని బట్టి BE/B.Tech, MSc, M.Tech, PhD, డిప్లొమా, టెన్త్+ITI, ఇంటర్, డిగ్రీ, PG, MBAతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ, రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: stpi.in