News April 22, 2025

‘ఛావా’ మరో రికార్డ్

image

విక్కీ కౌశల్, రష్మిక నటించిన ‘ఛావా’ మూవీ మరో రికార్డ్ సాధించింది. కేవలం హిందీలో రూ.600 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించిన మూడో చిత్రంగా నిలిచింది. గతంలో స్త్రీ-2, పుష్ప-2 ఈ ఘనత సాధించాయి. ఫిబ్రవరి 14న విడుదలైన ఛావా ఓవరాల్‌గా రూ.800 కోట్లకుపైగా కలెక్ట్ చేసింది. ప్రస్తుతం నెట్‌ప్లిక్స్‌లోనూ నంబర్-1 స్థానంలో స్ట్రీమింగ్ అవుతోంది. శంభాజీ మహారాజ్ జీవితకథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే.

Similar News

News April 22, 2025

జెత్వానీ వేధింపుల కేసు.. ఐపీఎస్ అధికారి అరెస్టు

image

AP: ముంబై నటి జెత్వానీ వేధింపుల కేసులో ఏపీ సీఐడీ అధికారులు IPS ఆఫీసర్ సీతారామాంజనేయులు (PSR ఆంజనేయులు)ను అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సీతారామాంజనేయులు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పని చేశారు. కూటమి ప్రభుత్వం ఈయనకు పోస్టింగ్ ఇవ్వకుండా సస్పెన్షన్‌లో పెట్టింది. ఇప్పటికే ఈ కేసులో వ్యాపారవేత్త విద్యాసాగర్ అరెస్టైన సంగతి తెలిసిందే.

News April 22, 2025

ALERT: భక్తులకు TTD కీలక సూచన

image

వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈక్రమంలో భక్తులకు TTD కీలక సూచన చేసింది. చాలా మంది తమకు కేటాయించిన టైమ్ స్లాట్‌కు బదులు ముందే వచ్చి క్యూలో నిల్చుంటున్నారని మండిపడింది. రద్దీ అధికంగా ఉండటంతో ఇలా చేయడం సరికాదని, కేటాయించిన టైమ్‌కు మాత్రమే రావాలని సూచించింది. భక్తులకు ఇబ్బందులు లేకుండా క్యూలోనే భోజనం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.

News April 22, 2025

RRvsLSG: రాజస్థాన్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు

image

IPL: జైపూర్‌లో ఏప్రిల్ 19న LSGతో జరిగిన మ్యాచ్‌లో RR అనూహ్య ఓటమి ఫిక్సింగ్ ఆరోపణలకు దారితీసింది. RR మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడిందంటూ రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్(RCA) అడ్‌హక్ కమిటీ కన్వీనర్ జైదీప్ బిహానీ ఆరోపించారు. హోం గ్రౌండ్‌లో గెలుపు ఖాయమనుకున్న దశలో ఎలా ఓడిపోయిందంటూ ప్రశ్నించారు. వెంటనే విచారణ చేపట్టాలన్నారు. RR యాజమాన్యం RCAను పక్కన పెట్టిందని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

error: Content is protected !!