News April 22, 2025
గురుకుల కాలేజీలు.. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ

TG: రాష్ట్రంలోని 130 BC గురుకుల జూనియర్ కాలేజీల్లో ఫస్టియర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. టెన్త్ పాసైన విద్యార్థులు నేటి నుంచి వచ్చే నెల 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. MPC, BiPC, CEC, HEC, MECలతో పాటు కంప్యూటర్ గ్రాఫిక్స్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ తదితర కోర్సులు ఉన్నాయి. బాలురకు 11,360 సీట్లు, బాలికలకు 10,720 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
వెబ్‌సైట్: https://mjptbcwreis.telangana.gov.in/
Similar News
News April 22, 2025
జెత్వానీ వేధింపుల కేసు.. ఐపీఎస్ అధికారి అరెస్టు

AP: ముంబై నటి జెత్వానీ వేధింపుల కేసులో ఏపీ సీఐడీ అధికారులు IPS ఆఫీసర్ సీతారామాంజనేయులు (PSR ఆంజనేయులు)ను అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సీతారామాంజనేయులు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పని చేశారు. కూటమి ప్రభుత్వం ఈయనకు పోస్టింగ్ ఇవ్వకుండా సస్పెన్షన్‌లో పెట్టింది. ఇప్పటికే ఈ కేసులో వ్యాపారవేత్త విద్యాసాగర్ అరెస్టైన సంగతి తెలిసిందే.
News April 22, 2025
ALERT: భక్తులకు TTD కీలక సూచన

వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈక్రమంలో భక్తులకు TTD కీలక సూచన చేసింది. చాలా మంది తమకు కేటాయించిన టైమ్ స్లాట్‌కు బదులు ముందే వచ్చి క్యూలో నిల్చుంటున్నారని మండిపడింది. రద్దీ అధికంగా ఉండటంతో ఇలా చేయడం సరికాదని, కేటాయించిన టైమ్‌కు మాత్రమే రావాలని సూచించింది. భక్తులకు ఇబ్బందులు లేకుండా క్యూలోనే భోజనం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.
News April 22, 2025
RRvsLSG: రాజస్థాన్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు

IPL: జైపూర్‌లో ఏప్రిల్ 19న LSGతో జరిగిన మ్యాచ్‌లో RR అనూహ్య ఓటమి ఫిక్సింగ్ ఆరోపణలకు దారితీసింది. RR మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడిందంటూ రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్(RCA) అడ్‌హక్ కమిటీ కన్వీనర్ జైదీప్ బిహానీ ఆరోపించారు. హోం గ్రౌండ్‌లో గెలుపు ఖాయమనుకున్న దశలో ఎలా ఓడిపోయిందంటూ ప్రశ్నించారు. వెంటనే విచారణ చేపట్టాలన్నారు. RR యాజమాన్యం RCAను పక్కన పెట్టిందని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.