News April 22, 2025

గ్రామీణ డాక్ సేవక్: సెకండ్ లిస్టు విడుదల

image

దేశవ్యాప్తంగా పోస్టాఫీసుల్లో 21,413 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు ఎంపికైన వారి రెండో జాబితా విడుదలైంది. <>https://indiapostgdsonline.gov.in/<<>>లో లిస్టు అందుబాటులో ఉంది. మొత్తం పోస్టుల్లో ఏపీలో 1,215, టీజీలో 519 పోస్టులను భర్తీ చేస్తున్నారు. సెకండ్ లిస్టులో AP నుంచి 702 మంది, TG నుంచి 169 మంది ఎంపికయ్యారు. అభ్యర్థులు మే 6లోగా సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరవ్వాలి. కాగా గత నెలలో తొలి జాబితా విడుదలైంది.

Similar News

News August 8, 2025

వరలక్ష్మీ వ్రతం.. భారీగా పెరిగిన పూల ధరలు!

image

AP: వరలక్ష్మీ వ్రతం సందర్భంగా మార్కెట్‌లో పూల ధరలు భారీగా పెరిగాయి. విజయవాడ హోల్ సేల్ మార్కెట్‌లో బంతిపూలు కేజీ రూ.300, గులాబీ, చామంతి కేజీ రూ.600 పలికింది. జాజులు, కనకాంబరాలు, మల్లెలు రూ.1200లకు కొనుగోలు చేశారు. కలువ పువ్వు ఒక్కోటి రూ.50 వరకు విక్రయించారు. రిటైల్ మార్కెట్‌లో ధరలు ఇంతకంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మీ ప్రాంతంలో రేట్లు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News August 8, 2025

స్కూళ్లకు సెలవులు

image

వరుస పండుగల నేపథ్యంలో నేటి నుంచి స్కూళ్లకు సెలవులు ప్రారంభమయ్యాయి. ఏపీలో నేడు వరలక్ష్మీ వ్రతం, రేపు రాఖీ పౌర్ణమి (రెండో శనివారం), ఆదివారం సందర్భంగా వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. అటు తెలంగాణలో ఇవాళ ఆప్షనల్ హాలిడే ఇవ్వడంతో పలు స్కూళ్లు హాలిడే ప్రకటించాయి. కొన్ని పాఠశాలలు సెలవు ప్రకటించలేదు. రేపు, ఎల్లుండి సెలవులు ఉండనున్నాయి. మరి మీ స్కూల్‌కు ఇవాళ హాలిడే ఇచ్చారా? కామెంట్ చేయండి.

News August 8, 2025

నేడు వరలక్ష్మీ వ్రతం.. వాయనం ఇస్తున్నారా?

image

వరలక్ష్మీ వ్రతం పూర్తయ్యాక నిండుమనసుతో ముత్తైదువులకు వాయనం ఇస్తే లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. వాయనంలో పసుపు, కుంకుమ, తమలపాకులు, గాజులు, జాకెట్ ముక్క, వక్కలు, పసుపు కొమ్ము, రూపాయి నాణెం, పువ్వులు, నానబెట్టిన శనగలు, పండ్లు ఉండేలా చూసుకోవాలని తెలిపారు. కుళ్లిపోయిన పండ్లు, పాడైపోయిన వస్తువులు ఉండకూడదు. ముత్తైదువును మహాలక్ష్మిగా భావించి ఆశీర్వాదం తీసుకోవాలి.