News April 22, 2025
పోలీస్ కస్టడీకి గోరంట్ల మాధవ్

మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను గుంటూరు మొబైల్ కోర్టు పోలీస్ కస్టడీకి అనుమతించింది. ఈ నెల 23, 24 తేదీల్లో రెండు రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు మాధవ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. పోలీస్ సిబ్బందిపై దాడి కేసులో ఆయనను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Similar News
News April 22, 2025
రాజన్న సిరిసిల్ల: ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 51.74 శాతం

ఇంటర్ ఫలితాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఫస్ట్ ఇయర్‌లో 3,819 మందికి 1,976 మంది పాసయ్యారు. 51.74 శాతం పాస్ పర్సంటేజీ వచ్చింది. సెకండ్ ఇయర్‌లో 3,670 మంది పరీక్షలు రాయగా 2,438 మంది పాసయ్యారు. 66.43 శాతం పాస్ పర్సంటేజీ వచ్చింది.
News April 22, 2025
Inter Results: సంగారెడ్డి జిల్లాలో ఇలా..!

ఇంటర్ ఫలితాల్లో సంగారెడ్డి జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. సెకండ్ ఇయర్‌లో 15727 మంది పరీక్షలు రాయగా 10892 మంది ఉత్తీర్ణతతో 69.26 శాతం పాస్ పర్సంటేజీ సాధించారు. ఫస్ట్ ఇయర్‌లో 17918 మందికి 10787 మంది పాసయ్యారు. 60.20 శాతం పాస్ పర్సంటేజీ సాధించారు.
News April 22, 2025
Inter Results: మెదక్ జిల్లాలో ఇలా..!

ఇంటర్ ఫలితాల్లో మెదక్ జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. సెకండ్ ఇయర్‌లో 5572 మంది పరీక్షలు రాయగా 3428 మంది ఉత్తీర్ణతతో 61.52 శాతం పాస్ పర్సంటేజీ సాధించారు. ఫస్ట్ ఇయర్‌లో 6153 మందికి 3028 మంది పాసయ్యారు. 49.24 శాతం పాస్ పర్సంటేజీ సాధించారు.