News April 22, 2025
నంద్యాల: డ్రంక్ అండ్ డ్రైవ్.. రూ.10 వేల ఫైన్

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ వ్యక్తికి కోర్టు రూ.10వేల జరిమానా విధించిందని నంద్యాల జిల్లా రుద్రవరం SI వరప్రసాద్ తెలిపారు. మందలూరు గ్రామానికి చెందిన మిద్దె సన్నోడు అనే వ్యక్తి మద్యం మత్తులో వాహనం నడిపాడన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరచగా ఆళ్లగడ్డ జేఎంఎఫ్‌సీ జడ్జి రూ.10వేల జరిమానా విధించినట్లు తెలిపారు.
Similar News
News April 22, 2025
ఇంటర్ ఫలితాల్లో హైదరాబాద్‌కు నిరాశ

ఇంటర్ ఫలితాల్లో మన హైదరాబాద్ విద్యార్థులు నిరాశ పరిచారు. ఫస్టియర్‌లో 66.68 శాతంతో సరిపెట్టుకున్నారు. 85,772 మంది పరీక్ష రాశారు. ఇందులో 57,197 మంది పాస్ అయ్యారు. సెకండియర్‌లో విద్యార్థుల కాస్త మెరుగుపడ్డారు. 74,781 మంది పాస్ పరీక్ష రాయగా.. 50,659 మంది ఉత్తీర్ణులయ్యారు. 67.74 శాతం ఉత్తీర్ణత సాధించారు. మేడ్చల్, రంగారెడ్డి విద్యార్థులు సత్తాచాటారు. టాప్ 10లోనూ మన హైదరాబాద్ పేరు లేకపోవడం గమనార్హం.
News April 22, 2025
INTER RESULT: కామారెడ్డి జిల్లాలో ఎంతమంది పాసయ్యారంటే?

ఇంటర్ ఫలితాల్లో కామారెడ్డి విద్యార్థులు సత్తా చాటారు. ఫస్ట్ ఇయర్‌లో 8,740 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 4,378 మంది పాసయ్యారు. 50.09% మంది ఉతీర్ణత సాధించారు. సెకండియర్ ఇయర్‌లో 7,722 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 4,354 మంది పాసయ్యారు. 56.38% ఉతీర్ణత సాధించారు.
News April 22, 2025
Inter Results.. మహబూబ్‌నగర్ జిల్లాలో ఇలా..!

ఇంటర్ ఫలితాల్లో మహబూబ్‌నగర్ జిల్లా విద్యార్థులు ప్రతిభ చూపారు. ఫస్ట్ ఇయర్‌లో 64.24 శాతం మంది పాసయ్యారు. 10,923 మంది పరీక్షలు రాయగా 7,017 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక సెకండ్ ఇయర్‌లో 71.35 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. 9,946 మంది పరీక్షలు రాయగా 7,096 మంది ఉత్తీర్ణత సాధించారు.