News April 22, 2025
నాగర్‌కర్నూల్: రంపంతో భర్త గొంతు కోసిన భార్య..!

నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలంలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ వెంకటేశ్ గౌడ్ తెలిపిన వివరాలు.. అవుసలికుంటలో కురుమయ్య, చెన్నమ్మ దంపతులు ఉంటున్నారు. ఈనెల 19న భార్యతో కురుమయ్య గొడవపడ్డాడు. అదేరోజు రా.11 గంటలకు భర్త నిద్రిస్తుండగా చెన్నమ్మ కోపంతో వెళ్లి రంపం బ్లేడ్ తీసుకొచ్చి కురుమయ్య గొంతు కోసింది. అతడు అరవగా పక్కింట్లో ఉన్న బంధువులు వచ్చి ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదైంది.
Similar News
News April 22, 2025
Inter Results.. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఇలా..!

ఇంటర్ ఫలితాల్లో నాగర్‌కర్నూల్ జిల్లా విద్యార్థులు కాస్త వెనుకంజలో ఉన్నారు. ఫస్ట్ ఇయర్‌లో 48.77 శాతం మంది పాసయ్యారు. 6,477 మంది పరీక్షలు రాయగా 3,159 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక సెకండ్ ఇయర్‌లో 63.93 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. 5,899 మంది పరీక్షలు రాయగా 3,771 మంది ఉత్తీర్ణత సాధించారు.
News April 22, 2025
INTER RESULTS.. జనగామలో ఎంత మంది పాస్ అయ్యారంటే?

ఇంటర్ ఫలితాల్లో జనగామ జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. సెకండ్ ఇయర్‌లో 4,077 మంది పరీక్షలు రాయగా 2,634 మంది ఉత్తీర్ణత సాధించారు. 64.61 పాస్ పర్సంటేజీ వచ్చింది. ఫస్ట్ ఇయర్‌లో 4,251 మంది విద్యార్థులకు 2,286 మంది ఉత్తీర్ణులు కాగా.. 53.78 పాస్ పర్సంటేజీ నమోదైంది.
News April 22, 2025
INTER RESULTS.. హనుమకొండలో ఎంత మంది పాస్ అయ్యారంటే?

ఇంటర్ ఫలితాల్లో హనుమకొండ జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. సెకండ్ ఇయర్‌లో 18,479 మంది పరీక్షలు రాయగా 13,601 మంది ఉత్తీర్ణత సాధించారు. 73.60 పాస్ పర్సంటేజీ వచ్చింది. ఫస్ట్ ఇయర్‌లో 19,543 మంది విద్యార్థులకు 13,601 మంది ఉత్తీర్ణులు కాగా.. 69.60 పాస్ పర్సంటేజీ నమోదైంది.