News April 22, 2025
చిట్యాల: రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి

చిట్యాల సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా.. జహీర్ పటేల్ అనే వ్యక్తి బీదర్ నుంచి విశాఖపట్నం వెళ్తున్నాడు. కంటైనర్‌ను పక్కకు ఆపి ఎదురుగా ఉన్న హోటల్లో భోజనం చేయడానికి రోడ్డు దాటుతున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు ఢీకొట్టడంతో జహీర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News April 22, 2025
ఇంటర్ రిజల్ట్స్: నల్గొండ పాస్ పర్సంటేజ్ ఇలా..

నల్గొండ జిల్లాలో ఫస్టియర్ పరీక్షను 13,977 మంది రాయగా 7931 మంది పాసయ్యారు. ఉత్తీర్ణతా శాతం 56.74 శాతంగా ఉంది. సెకండియర్‌లో 12,992 విద్యార్థులకు గాను 8,960 మంది పాసయ్యారు. పాస్ పర్సంటేజ్ 68.97శాతంగా ఉంది.
News April 22, 2025
నాగార్జునసాగర్ జలాశయం నేటి సమాచారం

నాగార్జునసాగర్ జలాశయం సమాచారాన్ని అధికారులు మంగళవారం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు ఉండగా ప్రస్తుతం 514.60 అడుగులుగా ఉంది. కుడి, ఎడమ కాలువలకు నీరు విడుదల చేయడ లేదు. జలాశయానికి ఇన్ ఫ్లో నిల్ ఉండగా, అవుట్ ఫ్లో 1,350 క్యూసెక్కులు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
News April 22, 2025
NLG: కొత్త కార్డులు ఇచ్చేది ఎప్పుడో..!

జిల్లాలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుదారులకు నిరీక్షణ తప్పడం లేదు. కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించింది. దీంతో జిల్లాలో 1,25,733 మంది దరఖాస్తులు చేసుకున్నారు. బీసీ కుల గణన సమయంలో 27, 523 మంది.. సవరణల కోసం 37,229 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటన్నింటిని పరిశీలించిన అధికారులు 69,473 దరఖాస్తులకు అప్రూవల్ చేసినా సివిల్ సప్లై శాఖ ఓకే చెప్పలేదు.