News April 22, 2025
పార్వతీపురం మన్యంలో నేటి ఉష్ణోగ్రతలు ఇలా

పార్వతీపురం జిల్లాలో మంగళవారం ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని APSDM తెలిపింది. ఉదయం 10 తర్వాత బయటికొచ్చే వారంతా జాగ్రత్తలు పాటించాలని సూచించింది. సీతానగరం, గరుగుబిల్లి మండలాల్లో 43.9°C, బలిజిపేట, గుమ్మలక్ష్మీపురం పార్వతీపురం మండలాల్లో 43°C పైన ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. మిగిలిన అన్ని మండలాల్లో 41 డిగ్రీల పైగా ఉష్ణోగ్రత నమోదు అవుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
Similar News
News January 12, 2026
వెనిజులా అధ్యక్షుడిని నేనే.. ట్రంప్ సంచలన ప్రకటన

వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిని తానేనంటూ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ ద్వారా వెల్లడించారు. మదురో అరెస్ట్ తర్వాత వెనిజులా తాత్కాలిక ప్రెసిడెంట్‌గా డెల్సీ రోడ్రిగ్స్ నియమితులైన విషయం తెలిసిందే. అయితే ఆ దేశంపై పూర్తి ఆధిపత్యం కోసం చూస్తున్న ట్రంప్ ఏకంగా అధ్యక్షుడిని తానేనంటూ పై ఫొటోను పోస్ట్ చేశారు.
News January 12, 2026
నిజామాబాద్: బీసీ స్టడీ సర్కిల్‌కు సొంత భవనం నిర్మించండి

నిజామాబాద్‌లోని ప్రభుత్వ బీసీ స్టడీ సర్కిల్ మంచి ఫలితాలు సాధిస్తుంది. కానీ అద్దె భవనంలో కొనసాగడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బీసీ స్టడీ సర్కిల్‌కు సొంతభవనం నిర్మించాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నరాల సుధాకర్ కోరారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌ను ఆదివారం వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా మరో రెండు ప్రభుత్వ కాలేజీ హాస్టళ్లను మంజూరు చేయాలని కోరారు.
News January 12, 2026
NLG: ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల దందా.. విద్యాశాఖ మౌనమెందుకు?

కార్పొరేట్ పాఠశాలలు పబ్లిసిటీ పేరుతో తల్లిదండ్రుల జేబులకు చిల్లు పెడుతున్నాయి. నల్గొండ, మిర్యాలగూడ, హాలియా, దేవరకొండ సహా పలు కేంద్రాల్లో విద్యార్థుల నుంచి ప్రోగ్రాంల పేరుతో అడ్డగోలుగా వసూళ్లు చేస్తున్నారని ఆరోపణలొస్తున్నాయి. కేవలం వండర్ లా విహారయాత్ర పేరుతో ఒక్కో విద్యార్థి నుంచి రూ. 2500 వరకు గుంజుతున్నట్లు సమాచారం. ఇలాంటి వసూళ్లపై అధికారులు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.


