News April 22, 2025

గద్వాల: హోమ్ గార్డ్స్‌తో జిల్లా ఎస్పీ సమీక్ష

image

మహబూబ్‌నగర్ జిల్లా నుంచి రొటేషన్ ద్వారా గద్వాలకు వచ్చిన 53 మంది హోమ్ గార్డ్స్‌తో జిల్లా ఎస్పీ టి.శ్రీనివాసరావు సోమవారం సమావేశమయ్యారు. గ్రివెన్స్ హాల్‌లో జరిగిన ఈ సమీక్షలో ఆయన మాట్లాడారు. హోమ్ గార్డ్స్ క్రమశిక్షణతో పని చేసి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. విధుల్లో ఇబ్బందులు ఉంటే అధికారులకు తెలియజేయాలని, ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.

Similar News

News April 22, 2025

ఇంటర్ ఫలితాల్లో హైదరాబాద్‌కు నిరాశ

image

ఇంటర్ ఫలితాల్లో మన హైదరాబాద్‌ విద్యార్థులు నిరాశ పరిచారు. ఫస్టియర్‌లో 66.68 శాతంతో సరిపెట్టుకున్నారు. 85,772 మంది పరీక్ష రాశారు. ఇందులో 57,197 మంది పాస్ అయ్యారు. సెకండియర్‌లో విద్యార్థుల కాస్త మెరుగుపడ్డారు. 74,781 మంది పాస్ పరీక్ష రాయగా.. 50,659 మంది ఉత్తీర్ణులయ్యారు. 67.74 శాతం ఉత్తీర్ణత సాధించారు. మేడ్చల్, రంగారెడ్డి విద్యార్థులు సత్తాచాటారు. టాప్‌ 10లోనూ మన హైదరాబాద్‌ పేరు లేకపోవడం గమనార్హం.

News April 22, 2025

INTER RESULT: కామారెడ్డి జిల్లాలో ఎంతమంది పాసయ్యారంటే?

image

ఇంటర్ ఫలితాల్లో కామారెడ్డి విద్యార్థులు సత్తా చాటారు. ఫస్ట్ ఇయర్‌లో 8,740 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 4,378 మంది పాసయ్యారు. 50.09% మంది ఉతీర్ణత సాధించారు. సెకండియర్ ఇయర్‌లో 7,722 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 4,354 మంది పాసయ్యారు. 56.38% ఉతీర్ణత సాధించారు.

News April 22, 2025

Inter Results.. మహబూబ్‌నగర్ జిల్లాలో ఇలా..!

image

ఇంటర్ ఫలితాల్లో మహబూబ్‌నగర్ జిల్లా విద్యార్థులు ప్రతిభ చూపారు. ఫస్ట్ ఇయర్‌లో 64.24 శాతం మంది పాసయ్యారు. 10,923 మంది పరీక్షలు రాయగా 7,017 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక సెకండ్ ఇయర్‌లో 71.35 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. 9,946 మంది పరీక్షలు రాయగా 7,096 మంది ఉత్తీర్ణత సాధించారు.

error: Content is protected !!