News April 22, 2025
మెదక్: యువతి అదృశ్యం.. కేసు నమోదు

ఆసుపత్రికి వెళ్లిన యువతి కనిపించకుండా పోయిన ఘటన శివంపేట మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఓ గ్రామానికి చెందిన యువతి (18) ఓ పరిశ్రమలో కూలీగా పనిచేస్తుంది. ఈనెల 19న తూప్రాన్ ఆసుపత్రికి వైద్యం కోసం వెళ్లి తిరిగి రాలేదు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News January 12, 2026
కామారెడ్డి: 2కే రన్ ప్రారంభించిన అడిషనల్ ఎస్పీ

కామారెడ్డి జిల్లా కేంద్రంలో క్రీడాభారతి ఆధ్వర్యంలో 2కే రన్‌ను అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి ప్రారంభించారు. యువజన ఉత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆమె మాట్లాడుతూ.. వివేకానందున్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని సమాజంలో ముందుకు పోవాలని సూచించారు. యువకులు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ఆమె సూచించారు.
News January 12, 2026
18 ఏళ్లు నిండిన విద్యార్థులు లెర్నర్స్ లైసెన్స్ పొందండి: DTO

సంక్రాంతి సెలవులకు వస్తున్న విద్యార్థులు లెర్నింగ్ లైసెన్స్ పొందేందుకు ఇదే మంచి అవకాశమని DTO దేవిశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. 18 ఏళ్లు నిండిన వారు ఆధార్ అడ్రస్ ఆధారంగా ‘parivahan.saradhi.gov.in’ వెబ్‌సైట్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. సంబంధిత ఆర్‌టీఓ కార్యాలయానికి హాజరై, పరీక్ష రాసి లైసెన్స్ పొందవచ్చని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News January 12, 2026
కొనసాగుతున్న రూపాయి పతనం

ఈ వారం మార్కెట్‌ను రూపాయి నష్టాలతో ప్రారంభించింది. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే 5 పైసలు పతనమయ్యి రూ.90.23 వద్ద కొనసాగుతోంది. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, విదేశీ పెట్టుబడిదారుల ఉపసంహరణలు ప్రతికూల ప్రభావాన్ని చూపించాయి. శుక్రవారం 28 పైసలు పతనమయ్యి రూ.90.18 వద్ద ముగియగా ఇవాళ కూడా నష్టాల్లో కొనసాగుతోంది. జియో పాలిటిక్స్, అమెరికా టారిఫ్స్ భయం కూడా దీనికి కారణమని మార్కెట్ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.


