News April 22, 2025

HYDలో SRనగర్‌ CI ది గ్రేట్

image

రూల్స్ ఫాలో అవకపోతే ట్రాఫిక్ పోలీసులు ఎంత కఠినంగా ఉంటారో తెలిసిందే. నగరవాసులకు ఆపద వస్తే మాత్రం అంతకుమించి మానవత్వం చూపిస్తారు. అలాంటి ఘటనే మన SRనగర్‌లో జరిగింది. ఉమేశ్ చంద్ర విగ్రహం వద్ద సోమవారం ఓ మైనర్‌ వాహనం నడుపుతూ ప్రమాదానికి గురయ్యాడు. విధుల్లో ఉన్న CI సైదులు ఇది గమనించాడు. బాలుడిని పైకి లేపి FIRST AID చేశారు. ఆస్పత్రికి తరలించి, చికిత్స చేయించారు. బాలుడికి కౌన్సెలింగ్ ఇచ్చి, ఇంటికి పంపారు.

Similar News

News July 8, 2025

ఎంఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ జవాబు పత్రాల నకలుకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఓయూ పరిధిలోని ఎంఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షల జవాబు పత్రాల నకలు పొందేందుకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కోర్సు మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫలితాలను ఇప్పటికే విడుదల చేశామని చెప్పారు. జవాబు పత్రాల నకలు పొందేందుకు ఒక్కో పేపరు రూ.1,000 చొప్పున చెల్లించి వచ్చే నెల 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News July 8, 2025

బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ పరీక్షా ఫలితాల విడుదల

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఈ కోర్సు సెమిస్టర్ పరీక్షా ఫలితాలను విడుదల చేశామన్నారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.

News July 8, 2025

కాంగ్రెస్ HYD, RR జిల్లాలకు కొత్త ఇన్‌ఛార్జ్‌లు

image

TGలో కాంగ్రెస్ సంస్థాగత పునర్నిర్మాణం దిశగా కీలక అడుగు వేసింది. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ బలోపేతానికి చర్యలు చేపట్టింది. AICC TG ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆమోదంతో జిల్లాలకు కొత్త ఇన్‌ఛార్జ్‌లను నియమించారు. HYD జిల్లాకు జగ్గారెడ్డి, ఉమ్మడి RRకు శివసేనా రెడ్డిని నియమించారు. వీరి నియామకంతో అధికార పార్టీకి సిటీ, శివారులో పట్టు దొరుకుతుందని శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.