News March 28, 2024
వివిధ లా కోర్సుల పరీక్షా ఫలితాల విడుదల

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ లా కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ప్రకటనలో తెలిపారు. ఐదేళ్ల బీబీఏ ఎల్ఎల్బీ, ఐదేళ్ల బీకామ్ ఎల్ఎల్బీ, మూడేళ్ల ఎల్ఎల్బీ, మూడేళ్ల ఎల్ఎల్బీ ఆనర్స్ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
Similar News
News November 14, 2025
Jubilee hills bypoll: రిజల్ట్ ఎక్కడున్నా తెలుసుకోవచ్చు!

యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో మరికొద్దిసేపట్లో కౌంటింగ్ జరగనుంది. అయితే, రౌండ్ల వారీగా రిజల్ట్ అప్‌డేట్స్ కోసం అంతా ఎదురుచూస్తున్నారు. ప్రజలకు ఎప్పటికప్పుడు వివరాలు అందించేందుకు ECI చర్యలు తీసుకుంది. స్టేడియంలో LED స్క్రీన్ ఏర్పాటు చేశారు. EC యాప్ ద్వారా అప్డేట్ ఇస్తామని అధికారులు చెప్పారు. Way2Newsలోనూ ఎప్పటికప్పుడు జూబ్లీహిల్స్ ఫలితాల వివరాలు చూసుకోవచ్చు.
SHARE IT
News November 14, 2025
జూబ్లీహిల్స్ బైపోల్.. ప్రతి ఓటు కీలకమే..!

ప్రతిష్ఠాత్మక జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్, BRS మధ్య థగ్ ఆఫ్ వార్ పోటీ నేపథ్యంలో ప్రతి ఒక్క ఓటు కీలకం కానుంది. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో 42 టేబుల్స్‌పై 10 రౌండ్లలో కౌంటింగ్ జరగనుండగా ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తం 4,01,365 ఓట్లు ఉండగా అందులో 1,94,631 మంది ఓటేశారు. ఏ పార్టీ గెలిచినా మెజార్టీ ఎక్కువ ఉండదనే చర్చ నడుస్తోంది. దీనిపై మీ కామెంట్?
News November 14, 2025
జూబ్లీహిల్స్ కౌంటింగ్: NOTAతో కలిపి 59 మంది.. ECI స్పెషల్ పర్మిషన్

జూబ్లీహిల్స్‌లో నోటాతో కలిపి 59 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ECI నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుని ఈ సారి కౌంటింగ్ కోసం 42 టేబుల్స్ ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియను సాధారణ పరిశీలకులు, ECI బృందం పరిశీలించనుంది. మొత్తం కౌంటింగ్ ప్రక్రియకు 186 మంది సిబ్బందిని నియమించారు. వీరిలో కౌంటింగ్ సూపర్‌వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, కౌంటింగ్ మైక్రో అబ్జర్వర్స్ ఉంటారు.


