News April 22, 2025
KNR: సెమిస్టర్ పరీక్షల నిర్వహణకు నిరాకరణ

KNR SU పరిధిలోని డిగ్రీ SEM పరీక్షల నిర్వహణకు సహకరించబోమని ప్రైవేట్ కళాశాలల సంఘం SUPMA తేల్చి చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పరీక్ష ఫీజులు చెల్లించామని, రాష్ట్ర ప్రభుత్వం గత 3 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న RTF, MTF బకాయిల విడుదలపై స్పష్టత వచ్చేవరకు పరీక్షల నిర్వహణను నిరాకరిస్తున్నట్లు SUPMA రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, జిల్లా కార్యదర్శి శ్రీపాద నరేశ్ SU అధికారులకు వినతిపత్రం ఇచ్చారు.
Similar News
News April 22, 2025
సివిల్స్ ర్యాంక్ కొట్టిన షాద్‌నగర్ యువతి

UPSCలోనూ మన రంగారెడ్డి జిల్లా వాసులు రాణించారు. షాద్‌నగర్‌లోని టీచర్స్‌కాలనీకి చెందిన రాఘవేందర్ రావు కుమార్తె ఇంద్రార్చిత కొంతకాలంగా సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నారు. తాజాగా విడుదలైన UPSC ఫలితాల్లో 739 ర్యాంక్ సాధించారు. పట్టుదలతో చదివి ర్యాంక్ సాధించడం పట్ల షాద్‌నగర్ వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఆల్ ఇండియాలో రంగారెడ్డి జిల్లా యువత మెరుగైన ఫలితాలు సాధించడం విశేషం.
News April 22, 2025
కాట్రేనికోన: క్యాథలిక్ గురువు ఫ్రాన్సిస్‌కు చిత్ర నీరాజనం

క్యాథలిక్కుల అత్యున్నత మత గురువు పోప్ ఫ్రాన్సిస్ తన యావత్తు జీవితాన్ని ప్రభువు సేవకై అంకితం చేశారు. సువార్త విలువలతో జీవించాలని ప్రబోధనలు చేస్తూ..ఏసుక్రీస్తుకు నిజమైన శిష్యుడిలా జీవించిన పోప్ ఫ్రాన్సిస్ అందరినీ దుఃఖ సాగరంలో ముంచి ప్రభువు వద్దకు చేరుకున్నారు. కాట్రేనికోనకు ప్రముఖ చిత్రకారుడు అంజి ఆకొండి ఫ్రాన్సిస్ చిత్రాన్ని అద్భుతంగా మలిచి అతని మృతికి చిత్ర నీరాజనం అర్పించారు.
News April 22, 2025
ఆ దేశంలో చాలా సేఫ్టీ.. అందుకే ఇల్లు కొన్నా: సైఫ్

ఖతార్‌లో తనకు చాలా సేఫ్టీగా అనిపించిందని, అందుకే అక్కడ ఓ ఇల్లు కొన్నానని నటుడు సైఫ్ అలీ ఖాన్ అన్నారు. త్వరలోనే తన కుటుంబానికి ఆ ఇల్లు చూపిస్తానని తెలిపారు. ‘నేను ఖతార్‌లో ఇల్లు కొనడానికి చాలా కారణాలు ఉన్నాయి. ముంబై నుంచి అక్కడికి ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. ఖతార్ వాతావరణం అద్భుతంగా ఉంటుంది.’ అని చెప్పారు. ఇటీవల సైఫ్‌పై హత్యాయత్నం జరిగిన క్రమంలో ఆయన అక్కడ ఇల్లు కొనడం చర్చనీయాంశంగా మారింది.