News April 22, 2025
ఒక్కరోజే రూ.2,750 పెరిగిన తులం బంగారం

బంగారం ధరలు సరికొత్త మైలురాయి చేరాయి. హైదరాబాద్‌లో ఇవాళ 10 గ్రాముల 24క్యారెట్ల పసిడి ₹1649 పెరిగి ₹1,00,000కు చేరింది. ఇక 22 క్యారెట్ల పుత్తడి కూడా 10గ్రాములకు ₹2,750 పెరిగి తొలిసారి ₹92,900కు చేరింది. అటు KG వెండి ₹1,11,000గా ఉంది. విజయవాడ, విశాఖ సహా రెండు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి. అంతర్జాతీయ ఒడిదుడుకులతో బంగారంపై పెట్టుబడికి డిమాండ్, స్థానిక వివాహాల సీజన్ ఈ ధరల ధగధగకు ప్రధాన కారణాలు.
Similar News
News August 7, 2025
నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం అంచనా వేసింది. నల్గొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో(30-40km/h) కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
News August 7, 2025
ఈ నెల 22న చిరు-అనిల్ మూవీ గ్లింప్స్?

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 22న చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. షైన్ స్క్రీన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ మూవీని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు.
News August 7, 2025
సిరాజ్, ప్రసిద్ధ్‌లకు కెరీర్ బెస్ట్ ర్యాంకింగ్స్

ICC తాజాగా ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత పేసర్లు సిరాజ్, ప్రసిద్ధ్‌లు కెరీర్ బెస్ట్ ర్యాంకులను పొందారు. సిరాజ్ 12 స్థానాలు ఎగబాకి 15వ ర్యాంకులో, ప్రసిద్ధ్ 25 స్థానాలు ఎగబాకి 59th ర్యాంకులో నిలిచారు. బుమ్రా తొలి స్థానంలో కొనసాగుతున్నారు. టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో జైస్వాల్ 5, పంత్ 8, గిల్ 13వ స్థానాల్లో నిలిచారు. ఆల్‌రౌండర్ల జాబితాలో జడేజా తొలి స్థానంలో, సుందర్ 16వ స్థానంలో ఉన్నారు.