News April 22, 2025
MHBD: తేలనున్న 9,317 మంది విద్యార్థుల భవితవ్యం!

MHBD జిల్లాలో ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరాల్లో ఈ ఏడాది 9,317 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మంగళవారం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. మొదటి సంవత్సరం జనరల్‌లో 3,196 మంది, ఒకేషనల్ 1199, ద్వితీయ సంవత్సరం జనరల్-3,716, ఒకేషనల్-1,206 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలను వేగంగా Way2News యాప్‌లో చూసుకోవచ్చు.
Similar News
News April 22, 2025
సివిల్స్ ర్యాంక్ కొట్టిన షాద్‌నగర్ యువతి

UPSCలోనూ మన రంగారెడ్డి జిల్లా వాసులు రాణించారు. షాద్‌నగర్‌లోని టీచర్స్‌కాలనీకి చెందిన రాఘవేందర్ రావు కుమార్తె ఇంద్రార్చిత కొంతకాలంగా సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నారు. తాజాగా విడుదలైన UPSC ఫలితాల్లో 739 ర్యాంక్ సాధించారు. పట్టుదలతో చదివి ర్యాంక్ సాధించడం పట్ల షాద్‌నగర్ వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఆల్ ఇండియాలో రంగారెడ్డి జిల్లా యువత మెరుగైన ఫలితాలు సాధించడం విశేషం.
News April 22, 2025
కాట్రేనికోన: క్యాథలిక్ గురువు ఫ్రాన్సిస్‌కు చిత్ర నీరాజనం

క్యాథలిక్కుల అత్యున్నత మత గురువు పోప్ ఫ్రాన్సిస్ తన యావత్తు జీవితాన్ని ప్రభువు సేవకై అంకితం చేశారు. సువార్త విలువలతో జీవించాలని ప్రబోధనలు చేస్తూ..ఏసుక్రీస్తుకు నిజమైన శిష్యుడిలా జీవించిన పోప్ ఫ్రాన్సిస్ అందరినీ దుఃఖ సాగరంలో ముంచి ప్రభువు వద్దకు చేరుకున్నారు. కాట్రేనికోనకు ప్రముఖ చిత్రకారుడు అంజి ఆకొండి ఫ్రాన్సిస్ చిత్రాన్ని అద్భుతంగా మలిచి అతని మృతికి చిత్ర నీరాజనం అర్పించారు.
News April 22, 2025
ఆ దేశంలో చాలా సేఫ్టీ.. అందుకే ఇల్లు కొన్నా: సైఫ్

ఖతార్‌లో తనకు చాలా సేఫ్టీగా అనిపించిందని, అందుకే అక్కడ ఓ ఇల్లు కొన్నానని నటుడు సైఫ్ అలీ ఖాన్ అన్నారు. త్వరలోనే తన కుటుంబానికి ఆ ఇల్లు చూపిస్తానని తెలిపారు. ‘నేను ఖతార్‌లో ఇల్లు కొనడానికి చాలా కారణాలు ఉన్నాయి. ముంబై నుంచి అక్కడికి ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. ఖతార్ వాతావరణం అద్భుతంగా ఉంటుంది.’ అని చెప్పారు. ఇటీవల సైఫ్‌పై హత్యాయత్నం జరిగిన క్రమంలో ఆయన అక్కడ ఇల్లు కొనడం చర్చనీయాంశంగా మారింది.