News April 22, 2025
HYD: కంచుకోటలో కదలని కారు!

BRS కంచుకోటలో ఆ పార్టీ పోటీ చేయకపోవడం శ్రేణులను విస్మయానికి గురిచేస్తోంది. ఫిబ్రవరిలో జరిగిన GHMC స్టాండింగ్ కమిటీ ఎన్నిక, ఇప్పుడు జరుగుతోన్న MLC కోటా ఎన్నిక నుంచి BRS తప్పుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతా వ్యతిరేక పవనాలు వీచినా.. గ్రేటర్ ప్రజలు గులాబీ జెండాను ఎగరేశారు. వాస్తవానికి MLC కోటాలో BRSకు 24 ఓట్లే ఉన్నా.. కనీసం ప్రత్యర్థులతో పోటీ పడకపోవడం శోచనీయం. దీనిపై మీ కామెంట్?
Similar News
News April 22, 2025
‘హజ్ యాత్రికులకు మెరుగైన సదుపాయాలు కల్పించండి’

హజ్ హౌస్‌లో రాష్ట్రస్థాయి సమన్వయ సమావేశం జరిగింది. మైనార్టీ సంక్షేమ శాఖ సంచాలకులు షేక్ యాస్మిన్ భాష అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 11,000 మంది హజ్ యాత్రికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అన్ని శాఖల అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. ఏప్రిల్ 29 నుంచి మే 29 వరకు విమానాలు మదీనా, జిద్దా వెళ్లనున్నాయి. జూన్ 12 నుంచి జూలై 9 వరకు తిరుగు ప్రయాణాల షెడ్యూల్ ఉంది.
News April 22, 2025
హైదరాబాద్‌లో CSIR స్టార్ట్‌అప్ కాంక్లేవ్

కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ హైదరాబాద్‌లో CSIR స్టార్ట్‌అప్ కాంక్లేవ్‌ను ప్రారంభించారు. CSIR లాబొరేటరీ IICT, CCMB, NGRI సంయుక్తంగా నిర్వహించిన ఈ కాంక్లేవ్‌లో 70కు పైగా స్టార్టప్‌లు తమ ఆవిష్కరణలు, ఉత్పత్తులు, ప్రదర్శించాయి. పరిశోధన, ఆవిష్కరణలకు వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి MP ఈటల రాజేందర్, ఉప్పల్ MLA బండారి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
News April 22, 2025
సివిల్స్ ర్యాంక్ కొట్టిన షాద్‌నగర్ యువతి

UPSCలోనూ మన రంగారెడ్డి జిల్లా వాసులు రాణించారు. షాద్‌నగర్‌లోని టీచర్స్‌కాలనీకి చెందిన రాఘవేందర్ రావు కుమార్తె ఇంద్రార్చిత కొంతకాలంగా సివిల్స్‌కు ప్రిపేర్ అవుతోంది. తాజాగా విడుదలైన UPSC ఫలితాల్లో 739 ర్యాంక్ సాధించింది. పట్టుదలతో చదివి ర్యాంక్ సాధించడం పట్ల షాద్‌నగర్ వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఆల్ ఇండియాలో రంగారెడ్డి జిల్లా యువత మెరుగైన ఫలితాలు సాధించడం విశేషం.