News April 22, 2025

మే 22 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ

image

తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 22 నుంచి ఉంటాయని ఇంటర్ బోర్డు ప్రకటించింది. జూన్ 3 నుంచి 6 వరకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇక అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీతో పాటు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఏప్రిల్ 23 నుంచి ఏప్రిల్ 30 వరకు ఫీజు చెల్లించవచ్చు. 9.97 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా పక్కా ప్రణాళికతో ఎక్కడా పొరపాట్లు జరగకుండా వ్యాల్యుయేషన్ జరిగిందని బోర్డు పేర్కొంది.

Similar News

News August 7, 2025

బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్డు తింటే ఎన్ని లాభాలో..

image

ప్రతిరోజు బ్రేక్‌ఫాస్ట్‌లో కోడిగుడ్డు ఉండేలా చూసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. గుడ్లలో హై క్వాలిటీ ప్రోటీన్ ఉంటుందని, దీని వల్ల కడుపు నిండిన భావన కలుగుతుందని తెలిపారు. అలాగే B12, D, A, E, B6 విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. కండరాల బలం, కంటి చూపు, మెదడు, కాలేయం ఆరోగ్యం కోసం ఇవి ఎంతో ముఖ్యం. అయితే ఖాళీ కడుపుతో కాకుండా అల్పాహారంతో కలిపి తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
SHARE IT

News August 7, 2025

ట్రంప్ టారిఫ్స్.. భారత్‌పైనే అత్యధికం!

image

మిత్ర దేశం అంటూనే భారత్‌పై ట్రంప్ టారిఫ్స్ యుద్ధం ప్రకటించారు. <<17326848>>ఇష్టారీతిన<<>> సుంకాల(50%)తో విరుచుకుపడుతున్నారు. భవిష్యత్తులోనూ ఇంకా పెంచుతానని హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా బ్రెజిల్(50%), భారత్ మాత్రమే అత్యధిక టారిఫ్స్ ఎదుర్కొంటున్నాయి. ఆ తర్వాత స్విట్జర్లాండ్(39%), కెనడా(35%), చైనా(30%) ఉన్నాయి. ట్రంప్ చర్యలతో US, భారత్ సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉందని ఇరు దేశాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

News August 7, 2025

120 డిగ్రీలు చేసిన విద్యావేత్త కన్నుమూత

image

AP: 120 డిగ్రీలు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన విద్యావేత్త డా.పట్నాల జాన్ సుధాకర్ (68) అనారోగ్యంతో కన్నుమూశారు. విశాఖ (D) పెందుర్తి (M) పెదగాడిలో జన్మించిన ఆయన తొలుత CBIలో చిన్న ఉద్యోగం చేశారు. తర్వాత సివిల్స్‌కు ఎంపికయ్యారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖ అదనపు డైరెక్టర్‌గా పనిచేసి రిటైరయ్యారు. ఉద్యోగాలు చేస్తూనే డిగ్రీలు పూర్తి చేశారు.