News April 22, 2025
VZM: రేపే పది ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో..!

రేపు ఉ.10 గంటలకు పదో తరగతి పరీక్షా ఫలితాలు ప్రకటించనున్నారు. విజయనగరం జిల్లాలో 2,359 పాఠశాలల నుంచి 23,765 మంది పరీక్ష రాయగా వారిలో 12,504 మంది బాలురు, 11,711 మంది బాలికలు ఉన్నారు. రెగ్యులర్ విద్యార్థులు 22,930 మంది కాగా ప్రైవేట్‌గా 835 మంది పరీక్ష రాశారు. మొత్తం 119 సెంటర్లలో పరీక్షలను నిర్వహించారు. ఒక్క క్లిక్‌తో వే2న్యూస్‌లో ఫలితాలను సులభంగా తెలుసుకోవచ్చు. >Share it
Similar News
News April 22, 2025
సివిల్స్‌లో 830వ ర్యాంక్ సాధించిన రాజాం యువకుడు

రాజాం మండలం సారధికి చెందిన వావిలపల్లి భార్గవ మంగళవారం విడుదలైన సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో 830వ ర్యాంక్ సాధించారు. నాలుగుసార్లు UPSC ఇంటర్వ్యూల వరకు వెళ్లి విఫలమైయారు. 5వ ప్రయత్నంలో సివిల్స్‌కు ఎంపికయ్యారు. ప్రస్తుతం వాణిజ్య పన్నుల శాఖలో పిడుగురాళ్ల సర్కిల్ కమిషనర్‌గా భార్గవ పనిచేస్తున్నారు. ఇయన తండ్రి విష్ణు ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వర్తిస్తున్నారు.
News April 22, 2025
విజయనగరం: Pic Of The Day

పోషకాహారంపై చిన్నారి వేషధారణ ఆలోచింజేస్తోంది. తెర్లాం మండలం కాగాం గ్రామానికి చెందిన జొన్నాడ సరస్వతి పోషణ పక్వాడాలో భాగంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంగన్వాడీ కార్యకర్తలు సరస్వతితో కాయగూరలు, ఆకుకూరలతో వేషధారణ వేయించారు. చెవి దిద్దులుగా టమాటాలు, మెడలో క్యారెట్, గోరు చిక్కుడు హారం, నడుముకు కరివేపాకు కట్టారు. గర్భిణులు ఏ ఆహారం తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందో ఈ చిన్నారి ప్రదర్శనతో వివరించింది.
News April 22, 2025
పోక్సో కేసులో నిందితుడికి 10 ఏళ్ల జైలు: VZM SP

బొబ్బిలి PSలో 2024లో నమోదైన పోక్సో కేసులో నిందితుడు మోహన్‌కు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.2వేల జరిమానాను కోర్టు విధించిందని ఎస్పీ వకుల్ జిందల్ సోమవారం తెలిపారు. పార్వతీపురం ఏకలవ్య స్కూల్లో చదువుతున్న బాలికకు తన మామయ్య ఫోన్ ఫే ద్వారా నగదు మోహన్‌కు పంపారని, డబ్బులు తీసుకొనేందుకు బాలిక బొబ్బిలికి రాగా రూమ్‌కి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడన్నారు. నేరం రుజువు కాగా శిక్ష ఖరారైందన్నారు.