News March 28, 2024

స్వయంగా వాదనలు వినిపిస్తున్న కేజ్రీవాల్

image

లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన సీఎం కేజ్రీవాల్ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో స్వయంగా వాదనలు వినిపిస్తున్నారు. ‘రెండేళ్ల క్రితం నుంచి ఈ కేసు నడుస్తోంది. 2022 ఆగస్టులో సీబీఐ కేసు నమోదైంది. నాపై ఆరోపణలు లేకున్నా అరెస్టు చేశారు’ అని చెబుతుండగా జడ్జి కావేరీ బవేజా ‘మీ వాదనలను రాతపూర్వకంగా ఇవ్వండి’ అని అడిగారు. దీనికి స్పందించిన కేజ్రీవాల్ ‘కాసేపు మాట్లాడనివ్వండి మేడమ్’ అని వాదనలు కొనసాగిస్తున్నారు.

Similar News

News March 16, 2026

భద్రాద్రి కలెక్టర్, ఎస్పీకి ఆహ్వాన పత్రిక అందజేత

image

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం, పట్టాభిషేకం మహోత్సవ ఆహ్వాన పత్రికలను సోమవారం కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజు, జిల్లా ప్రధాన జడ్జి పాటిల్ వసంత్, ఐటీడీఏ పీవో రాహుల్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాళ్ శ్రేష్ఠకు ఆలయ ఈవో దామోదర్ రావు అందజేశారు. కళ్యాణ మహోత్సవానికి విచ్చేసి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఈవో అధికారులను కోరారు.

News March 16, 2026

ఏ పార్టీలో చేరాలనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు: రాజాసింగ్

image

TG: అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తాను BJLP ఛాంబర్‌కి వెళ్లడంపై MLA రాజాసింగ్ స్పందించారు. ‘పాత ఇల్లు, పాత ఫ్రెండ్స్ కాబట్టి వెళ్లా. ఇంకా ఏ పార్టీలో చేరాలనేది డిసైడ్ అవ్వలేదు. ఎవరిని ఎవరు బతిమాలుతున్నారో భవిష్యత్తులో తెలుస్తుంది’ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా BJLP ఛాంబర్ నుంచి వస్తున్న రాజాసింగ్‌ను చూసిన KTR ‘BJP నుంచి సస్పెండ్ అయిన వ్యక్తి అక్కడికి ఎలా వెళ్లారు?’ అని సరదాగా ఆటపట్టించారు.

News March 16, 2026

నందిని సిధారెడ్డికి సాహిత్య అకాడమీ అవార్డు

image

TG: ప్రముఖ రచయిత నందిని సిధారెడ్డి రచించిన ‘అనిమేష’ కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 24 భారతీయ భాషలలో ఈ సాహిత్య అవార్డులను అకాడమీ ప్రకటించింది. ‘అనిమేష’తో పాటు ఆయా భాషల్లోని రచయితల సాహిత్య పుస్తకాలకు అవార్డులను ప్రకటించింది. కొవిడ్ సమయంలో ప్రజలు ఎదుర్కొన్న వేదన, భయం, సంఘర్షణలను ప్రతిబింబించే కావ్యమిది. అప్పటి పరిస్థితులను అక్షరరూపంలో కళ్లకు కట్టేలా రచయిత ఆవిష్కరించారు.