News April 22, 2025
ఇంటర్ ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా హవా

ఇంటర్ ఫలితాల్లో మన రంగారెడ్డి జిల్లా సత్తాచాటింది. ఫస్టియర్‌లో 76.36 శాతంతో రాష్ట్రంలోనే 2వ స్థానంలో నిలిచింది. మొత్తం 80,412 మంది పరీక్ష రాశారు. ఇందులో 61,406 మంది పాస్ అయ్యారు. సెకండియర్‌లోనూ విద్యార్థుల హవా కొనసాగింది. 70,581 మంది పరీక్ష రాయగా.. 54,721 మంది ఉత్తీర్ణులయ్యారు. సెకండియర్‌లో 77.53 శాతంతో రంగారెడ్డి జిల్లా 4వ స్థానంలో నిలిచింది.
Similar News
News April 23, 2025
HYD: OUలో వన్ టైం ఛాన్స్ పరీక్ష ఫీజుకు అవకాశం

OU పరిధిలోని డిగ్రీ కోర్సులకు వన్ టైమ్ ఛాన్స్ పరీక్షా ఫీజులు స్వీకరిస్తున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీఎస్‌డబ్ల్యూ తదితర కోర్సుల అన్ని సెమిస్టర్ల వన్ టైం ఛాన్స్ పరీక్షా ఫీజును వచ్చే నెల 19 వరకు చెల్లించవచ్చని చెప్పారు. రూ.500 అపరాధ రుసుంతో 29 వరకు చెల్లించే అవకాశం ఉందన్నారు. పూర్తి వివరాలకు www.osmania.ac.in ను చూడాలన్నారు.
News April 22, 2025
బీఆర్ఎస్ సభకు ప్రత్యేక ఏర్పాట్లు: జైపాల్ యాదవ్

వరంగల్లో బీఆర్ఎస్ సభకు కల్వకుర్తి నియోజకవర్గం నుంచి తరలి వెళ్లేందుకు 35 బస్సులు, 300 బైకులు ఏర్పాటు చేసినట్లు మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ చెప్పారు. మంగళవారం కడ్తాల్ లో పార్టీ నాయకులతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ.. సభకు తరలి వెళ్లే ముందు ఉదయం అన్ని గ్రామాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించాలని సూచించారు. నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.
News April 22, 2025
సివిల్స్ ర్యాంక్ కొట్టిన షాద్‌నగర్ యువతి

UPSCలోనూ మన రంగారెడ్డి జిల్లా వాసులు రాణించారు. షాద్‌నగర్‌లోని టీచర్స్‌కాలనీకి చెందిన రాఘవేందర్ రావు కుమార్తె ఇంద్రార్చిత కొంతకాలంగా సివిల్స్‌కు ప్రిపేర్ అవుతోంది. తాజాగా విడుదలైన UPSC ఫలితాల్లో 739 ర్యాంక్ సాధించింది. పట్టుదలతో చదివి ర్యాంక్ సాధించడం పట్ల షాద్‌నగర్ వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఆల్ ఇండియాలో రంగారెడ్డి జిల్లా యువత మెరుగైన ఫలితాలు సాధించడం విశేషం.