News April 22, 2025

RESULTS: ఆ గ్రూప్ విద్యార్థులకు షాక్

image

TG: ఇంటర్ ఫలితాల్లో HEC, CEC గ్రూప్ విద్యార్థులు నిరాశపరిచారు. ఫస్టియర్ HECలో 8959 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే 3092 మందే (34.51%) పాసయ్యారు. CECలో 92745 మంది హాజరైతే 42259 మంది (45.56%) ఉత్తీర్ణులయ్యారు. ఇక సెకండియర్ HECలో 9031 మంది రాస్తే 4178 మంది (46.26%), CECలో 103713 మంది హాజరైతే 48658 మంది (46.92%) పాస్ అయ్యారు.

Similar News

News August 7, 2025

NRPT: నేసినది కాదిది… సంప్రదాయాన్ని మోసిన చీర ఇదీ!

image

124 ఏళ్లకు పైగా చరిత్ర.. దేశవ్యాప్తంగా గుర్తింపు.. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మెచ్చిన చీరలే NRPT చీరలు. కోటకొండ వాసి యంగలి వెంకట్రాములు మగ్గంపై కుట్టులేని జాతీయ పతాకం నేసి ఘనత పొందారు. రుద్రాక్ష, కోటకొమ్మ, నివాళి, శంభు బార్డర్లు యువతకూ నచ్చేలా మారుస్తున్నారు. పేట పట్టు, కాటన్‌ చీరలకు ఎంతో ఫేమస్. జిల్లాలో 5 వేలకు పైగా నేతన్నలుండగా, 735 మగ్గాలకు జీయో ట్యాగింగ్‌ పూర్తైంది.
#నేడు జాతీయ చేనేత దినోత్సవం

News August 7, 2025

రాజగోపాల్‌ రెడ్డికి నోటీసులు?

image

TG: సీఎం రేవంత్ రెడ్డిపై పదేపదే బహిరంగ విమర్శలు చేస్తున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేయనుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ రాజగోపాల్‌ రెడ్డితో క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి భేటీ కానున్నారు. రేవంత్‌పై విమర్శల మీద వివరణ కోరనున్నారు. ఆయనతో మాట్లాడిన తర్వాత ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు.

News August 7, 2025

బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్డు తింటే ఎన్ని లాభాలో..

image

ప్రతిరోజు బ్రేక్‌ఫాస్ట్‌లో కోడిగుడ్డు ఉండేలా చూసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. గుడ్లలో హై క్వాలిటీ ప్రోటీన్ ఉంటుందని, దీని వల్ల కడుపు నిండిన భావన కలుగుతుందని తెలిపారు. అలాగే B12, D, A, E, B6 విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. కండరాల బలం, కంటి చూపు, మెదడు, కాలేయం ఆరోగ్యం కోసం ఇవి ఎంతో ముఖ్యం. అయితే ఖాళీ కడుపుతో కాకుండా అల్పాహారంతో కలిపి తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
SHARE IT