News April 22, 2025
Inter Results.. గద్వాల జిల్లాలో ఇలా..!

ఇంటర్ ఫలితాల్లో గద్వాల జిల్లా విద్యార్థులు ప్రతిభ చూపారు. ఫస్ట్ ఇయర్‌లో 59.25 శాతం మంది పాసయ్యారు. 4,054 మంది పరీక్షలు రాయగా 2,402 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక సెకండ్ ఇయర్‌లో 68.34 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. 3,616 మంది పరీక్షలు రాయగా 2,471 మంది ఉత్తీర్ణత సాధించారు.
Similar News
News April 22, 2025
దిగజారుతున్న పంత్ ప్రదర్శన.. ఫ్యాన్స్ ఫైర్

IPL: LSG కెప్టెన్ రిషభ్ పంత్ ప్రదర్శన రోజురోజుకూ దిగజారుతోంది. ఇవాళ DC మ్యాచ్‌లో చివర్లో వచ్చి డకౌట్ కాగా, ఆ జట్టు ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. వేలంలో రూ.27 కోట్లకు కొనుగోలు చేసి కెప్టెన్సీ ఇస్తే, ఇలాగేనా ఆడేది? అంటూ మండిపడుతున్నారు. పంత్ ఈ ఏడాది లీగ్‌లో 8 ఇన్నింగ్స్‌లలో ఒకే ఒక అర్ధశతకం(63) చేశారు. రెండు సార్లు డకౌట్ అయ్యారు. కేవలం 13.25 యావరేజ్, 96.36 స్ట్రైక్‌రేట్‌తో పేలవంగా ఆడుతున్నారు.
News April 22, 2025
‘ఆ టీచర్లను ఉన్నత పాఠశాలలోనే కొనసాగించాలి’

మిగులు ఉపాధ్యాయులను ఉన్నత పాఠశాలలోనే కొనసాగించాలని నోబెల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.శ్రీనివాస రాజు కోరారు. రాయచోటి పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 117 ఉత్తర్వు రద్దు ద్వారా ఉన్నత పాఠశాలలో అనేకమంది గణితం, తెలుగు, ఆంగ్లం, సాంఘిక శాస్త్ర పాఠశాల సహాయకులు ఎక్కువ సంఖ్యలో మిగులు ఉపాధ్యాయులుగా తేలుతున్నట్లు చెప్పారు.
News April 22, 2025
‘హజ్ యాత్రికులకు మెరుగైన సదుపాయాలు కల్పించండి’

హజ్ హౌస్‌లో రాష్ట్రస్థాయి సమన్వయ సమావేశం జరిగింది. మైనార్టీ సంక్షేమ శాఖ సంచాలకులు షేక్ యాస్మిన్ భాష అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 11,000 మంది హజ్ యాత్రికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అన్ని శాఖల అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. ఏప్రిల్ 29 నుంచి మే 29 వరకు విమానాలు మదీనా, జిద్దా వెళ్లనున్నాయి. జూన్ 12 నుంచి జూలై 9 వరకు తిరుగు ప్రయాణాల షెడ్యూల్ ఉంది.