News April 22, 2025
పెద్దపల్లి: ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 62.09 శాతం

ఇంటర్ ఫలితాల్లో పెద్దపల్లి జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఫస్ట్ ఇయర్‌లో 4,896 మందికి 3,040 మంది పాసయ్యారు. 62.09 శాతం పాస్ పర్సంటేజీ వచ్చింది. సెకండ్ ఇయర్‌లో 4,715 మంది పరీక్షలు రాయగా 3,359 మంది పాసయ్యారు. 71.24 శాతం పాస్ పర్సంటేజీ వచ్చింది.
Similar News
News April 24, 2025
IPL: మరోసారి ‘ఛాంపియన్’గా ముంబై?

సరైన టైమ్‌లో ఊపందుకున్న ముంబై ఇండియన్స్ మిగతా జట్లలో గుబులు రేపుతోంది. తొలి 5 మ్యాచుల్లో ఒకటే గెలిచిన ఆ జట్టు ఒక్కసారిగా పుంజుకుంది. బుమ్రా, బౌల్ట్, చాహర్, శాంట్నర్ దుర్భేద్యమైన బౌలింగ్‌కి తోడు రోహిత్ ఫామ్ అందుకోవడం, సూర్య నాటౌట్‌గా మ్యాచులు ఫినిష్ చేస్తుండటం, హార్దిక్ కెప్టెన్సీ అన్నీ ముంబైకి కలిసొస్తున్నాయి. హాట్ ఫేవరెట్‌ను చేశాయి. ప్లే ఆఫ్స్‌కి చేరితే MIని కప్పు కొట్టకుండా అడ్డుకోవడం కష్టమే.
News April 24, 2025
ఆల్ పార్టీ మీటింగ్‌కు మమ్మల్నీ పిలవాలి: అసదుద్దీన్

పహల్‌గామ్ దాడిపై కేంద్రం నిర్వహించనున్న ఆల్ పార్టీ మీటింగ్‌కు తమలాంటి చిన్న పార్టీలనూ ఆహ్వానించాలని MIM చీఫ్ అసద్ డిమాండ్ చేశారు. ‘5-10 మంది MPలున్న పార్టీలనే ఆహ్వానిస్తామని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. చిన్న పార్టీలు కూడా వస్తే మీటింగ్ టైమ్ ఎక్కువ పడుతుందని చెప్పారు. అన్ని పార్టీల అభిప్రాయాలు వినడానికి PM 1hr అదనంగా కేటాయించలేరా? ఎంపీలందరినీ ఎన్నుకుంది భారతీయులే కదా’ అని ట్వీట్ చేశారు.
News April 24, 2025
సిద్దిపేట: అప్పుల బాధతో కలప వ్యాపారి ఆత్మహత్య

అప్పుల బాధతో కలప వ్యాపారి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సిద్దిపేటలో చోటు చేసుకుంది. వివరాలు.. దుబ్బాక మండలం పెద్ద గుండవెల్లికి చెందిన చిన్న నర్సింహా రెడ్డి(56) సిద్దిపేటలోని గ్రీన్ కాలనీలో టింబర్ డిపో నడిపిస్తున్నాడు. వ్యాపారం కోసం చేసిన అప్పులు తీరకపొవడంతో మనస్తాపానికి గురైన నర్సింహారెడ్డి పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.