News March 28, 2024

ఎండలు: ‘హైదరాబాద్‌లో బయటకురాకండి’

image

HYD, ఉమ్మడి RR జిల్లాల పరిధిలో మరో రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గత 24 గంటల్లో బోరబండ 40.6, మొయినాబాద్ 40.6, కందుకూరు 40.5, యాలాలలో 40.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయినట్లుగా TSDPS తెలిపింది. BP, షుగర్, చర్మ వ్యాధులు ఉన్నవారు 11AM నుంచి 4PM మధ్య బయటకురాకపోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. వడదెబ్బ తాకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

Similar News

News January 1, 2026

HYDలో కొత్త జిల్లా.. త్వరలో ఉత్తర్వులు?

image

రాజధానికి 4 కమిషనరేట్‌లను తీసుకొచ్చిన ప్రభుత్వం తాజాగా కొత్త జిల్లా ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. కమిషనరేట్ల సరిహద్దులకు సమానంగా సిటీ పరిధిలోని 3 జిల్లాలను 4కు పెంచేలా CM ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. RRను ఫ్యూచర్ సిటీతో రూరల్ జిల్లాగా, అర్బన్ ప్రాంతాన్ని కొత్త జిల్లాగా ఏర్పాటు చేయనుంది. HYDజిల్లాలోని కంటోన్మెంట్‌ ఏరియాను మల్కాజిగిరిలో కలిపి, శంషాబాద్, రాజేందర్‌నగర్‌ను HYDలో కలపనుందట.

News January 1, 2026

HYDలో బిర్యానీ తిని ఒకరి మృతి.. 15మంది సీరియస్

image

న్యూ ఇయర్ వేడుక విషాదం మిగిల్చింది. మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట PS పరిధిలోని భవానినగర్‌లో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో మద్యం తాగి బిర్యానీ తిన్నవారు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో పాండు (53) మృతి చెందగా మరో 15 మంది సూరారంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News January 1, 2026

HYDని ‘బల్దియా’ ఎందుకు అంటారో తెలుసా?

image

GHMCని నగరవాసులు ‘బల్దియా’గా పిలుస్తారు. ఎందుకు ఈ పదం వాడతారో చాలా మందికి తెలియదు. పూర్వం HYDను ‘అత్రాఫ్‌బల్దా’గా పిలిచేవారు. అరబ్బీలో అత్రాఫ్ అంటే ఆవరణ, బల్దా అంటే పట్టణం. అదే అర్థంతో ఉర్దూలో నగర పాలక సంస్థను ‘బల్దియా’గా పిలవడం ప్రారంభమైంది. HYD నగర నిర్మాత మహ్మద్ కులీ కుతుబ్ షా కాలం నుంచే ఈ పదం వాడుకలోకి వచ్చింది. ఆసఫ్‌జాహీల పాలనలో ఉర్దూ అధికార భాష కావడంతో ‘బల్దియా’ ప్రజల నోట నాటుకుపోయింది.