News April 22, 2025

తూ.గో: గురుకుల ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదల

image

మహాత్మ జ్యోతిబా ఫూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశానికి సంబంధించి ప్రవేశపరీక్ష హాల్ టికెట్లను నేటి నుంచి https://mjpapbcwreis.apcfss.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఉమ్మడి తూ.గో జిల్లాలోని అమలాపురం, రాజమండ్రి, తుని, పెద్దాపురం పట్టణాల్లోని ఈ గురుకుల పాఠశాల్లో ఈ నెల 27న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య ప్రవేశ పరీక్ష జరగనుంది.

Similar News

News January 8, 2026

ప్రెగ్నెన్సీలో కాళ్లు వాపు వస్తున్నాయా?

image

ప్రెగ్నెన్సీలో కాళ్లవాపులు రావడాన్ని వైద్య పరిభాషలో జెస్టెషనల్‌ ఎడిమా అంటారు. గర్భిణిలలో ఏడో నెల నుంచి కాళ్లవాపు సాధారణంగా కనిపిస్తుంది. గర్భసంచి, బేబీ బరువుతో కొన్నిసార్లు కాళ్లవాపు వస్తుంది. గర్భిణుల్లో రక్త హీనత ఉన్నా, రక్తపోటు పెరిగినప్పుడు కాళ్లలో వాపు వస్తుంది. ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలు వేసుకున్నపుడు కూడా కొన్నిసార్లు కాళ్లవాపు కనిపిస్తుంది. సమస్య ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

News January 8, 2026

ADB: మున్సిపల్ ముసాయిదాలో ‘ఓట్ల’ గందరగోళం

image

పురపాలక సంఘాలతో పాటు ఎంఎన్‌సిఆర్‌ఎల్ (MNCRL) కార్పొరేషన్‌లో ప్రకటించిన ముసాయిదాలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఓట్లు వేర్వేరు వార్డుల్లో ఉండటం, కొత్త ఓటర్ల నమోదులో నిబంధనలు పాటించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుతో అర్హులైన వారు ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని, తక్షణమే సరిదిద్దాలని డిమాండ్ చేస్తూ సబ్ కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసనలు తెలిపారు.

News January 8, 2026

ప్రతి విషయానికి బాధ పడుతున్నారా?

image

అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే |
గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః ‖
విచారించకూడని విషయాల గురించి బాధపడటం సమయాన్ని వృథా చేసుకోవడమే! నిజమైన జ్ఞానులు పోయిన వారి గురించి కానీ, ఉన్న వారి గురించి కానీ, లేదా జరిగిపోయిన విషయాల గురించి కానీ అస్సలు శోకించరు. అనవసరమైన ఆలోచనలతో మెదడును సందిగ్ధంలో పడేయకుండా ఏది శాశ్వతమో తెలుసుకుని స్థితప్రజ్ఞతతో ఉండటమే అసలైన పరిష్కారం. <<-se>>#MSBP<<>>