News April 22, 2025

రాష్ట్రం ఎటు వెళ్తుందో అర్థం కావడం లేదు: జగన్

image

ఏపీలో కూటమి సర్కార్ దుష్ట సంప్రదాయాలకు తెరతీసిందని మాజీ CM జగన్ విమర్శించారు. కుట్ర పూరితంగా YCP శ్రేణులు, పోలీసులను అరెస్ట్ చేయడం కక్ష రాజకీయాలకు పరాకాష్ట అని ఆయన మండిపడ్డారు. తాడేపల్లిలో పార్టీ PAC సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ఒక వ్యక్తిని ఇరికించడానికి కేసులు సృష్టిస్తున్నారు. రాష్ట్రంలో అరాచకం తప్ప ఏమీ కనిపించడం లేదు. అసలు రాష్ట్రం ఎటు వెళ్తుందో అర్థం కావడం లేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Similar News

News November 18, 2025

పిస్తా హౌస్, షా గౌస్, Mehfil హోటళ్లలో ఐటీ సోదాలు

image

TG: హైదరాబాద్‌లోని ప్రముఖ హోటళ్లైన పిస్తా హౌస్, షా గౌస్, Mehfil ఛైర్మన్లు, డైరెక్టర్ల ఇళ్లలో ఆదాయపు పన్ను అధికారులు సోదాలు చేపట్టారు. మొత్తం 50 టీమ్స్‌తో 15 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు. ఈ రెండు హోటళ్లు ఏటా రూ.వందల కోట్ల వ్యాపారం చేస్తున్నాయి. HYD, దుబాయ్‌తో పాటు ఇతర నగరాల్లోనూ బ్రాంచులు ఉన్నాయి.

POK ప్రధానిగా రజా ఫైసల్

image

పాక్ ఆక్రమిత కశ్మీర్ నూతన ప్రధానిగా PPP నేత రజా ఫైసల్ ముంతాజ్ ఎన్నికయ్యారు. ఇమ్రాన్ ఖాన్ PTI పార్టీకి చెందిన అన్వరుల్ హక్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి ఆమోదం లభించడంతో కొత్త ప్రధాని కోసం ఓటింగ్ నిర్వహించారు. 52 సభ్యులకు గాను ముంతాజ్‌కు 32 మంది అనుకూలంగా ఓటేశారు. కాగా POKకు స్వయంప్రతిపత్తిని కల్పించినట్లు చెప్పుకునే పాక్ అక్కడ నామమాత్రపు PM, ప్రెసిడెంట్ పదవులను ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే.