News April 22, 2025
UPDATE: ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో ఎంతమంది పాసంటే?

ఇంటర్ మొదటి సంవత్సరం జనరల్ కోర్సులో మొత్తం 15,056 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 8,035 మంది ఉత్తీర్ణులు అయినట్లు DIEO తెలిపారు. వీరిలో బాలికలు 8,074 మంది హాజరు కాగా 5,191 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 6,982 మంది పరీక్షలకు హాజరు కాగా 2,844 మంది ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరం ఒకేషనల్ విద్యార్థులు మొత్తం 2,790 మంది పరీక్షలకు హాజరుకాగా 1,223 ఉత్తీర్ణులయ్యారని వివరించారు.
Similar News
News April 23, 2025
NZB: తల్లికి క్యాన్సర్.. కొడుకు ఆత్మహత్య

తల్లి క్యాన్సర్‌తో బాధపడుతూ ఉండటంతో మనస్తాపం చెందిన కొడుకు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన డిచ్‌పల్లిలో మంగళవారం వెలుగు చూసింది. ఎస్ఐ షరీఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. కమలాపూర్ గ్రామానికి చెందిన కర్రినోల్ల భూలక్ష్మి కొన్ని సంవత్సరాలుగా కాన్సర్‌తో పడపడుతుంది. ఇది జీర్ణించుకోలేక కొడుకు రంజిత్(28) ఈ నెల 21న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు పోలీసులు వివరించారు.
News April 23, 2025
NZB: వడదెబ్బ పోస్టర్లను ఆవిష్కరించిన కలెక్టర్

వాతావరణ మార్పులు-ప్రభావం వడదెబ్బపై పోస్టర్లను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు చేతులమీదుగా ఆవిష్కరించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ ఆధ్వర్యంలో వాతావరణ మార్పులు దాని ప్రభావం వడదెబ్బ నుంచి రక్షించుకుందాం అనే పోస్టర్లను అడిషనల్ కలెక్టర్ అంకిత్‌తో కలిసి ఆవిష్కరించారు. వాతావరణ మార్పుల ప్రభావంతో తీవ్రమైన వేడితో కూడిన ఎండలు ఉన్నందున ప్రజలంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
News April 22, 2025
ఆర్మూర్: చెరువులో మునిగి వ్యక్తి మృతి

చెరువులో పడిన గేదెను కాపాడబోయి వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. అంకాపూర్ శివారులోని గుండ్ల చెరువు వద్ద రమేశ్ గేదెలను మేపుతుండగా అవి చెరువులోకి వెళ్లాయి. వాటిని కాపాడేందుకు అతను చెరువులో దిగాడు. చేపలవల తట్టుకొని నీటిలో మునిగి చనిపోయాడు. మృతుడు ఇందల్వాయి మండలం గౌరారం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. భార్య అపర్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.