News April 22, 2025
Inter ఫలితాలు.. ఉమ్మడి ఖమ్మం జిల్లా ర్యాంకులివే

ఇంటర్ ఫలితాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్‌లో ఖమ్మం జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా 69.94 శాతం సాధించి 4వ స్థానం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 62.45 శాతం సాధించి 10వ స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్లో ఖమ్మం 76.81 శాతం సాధించి 5వ స్థానం, భద్రాద్రి కొత్తగూడెం 72.43 శాతంతో 9వ స్థానంలో నిలిచింది.
Similar News
News April 23, 2025
ASF: సివిల్స్‌లో మెరిసిన రైతుబిడ్డ

రైతుబిడ్డ సివిల్స్ ఫలితాల్లో మెరిసి ఔరా అనిపించారుడు. ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం బోదంపల్లికి చెందిన రాంటెంకి సోమయ్య-ప్రమీల దంపతుల కుమారుడు సుధాకర్ మంగళవారం విడుదల చేసిన సివిల్స్ ఫలితాల్లో ఆలిండియా 949వ ర్యాంక్ సాధించారు. మారుమూల గ్రామీణ ప్రాంతంలోని రైతుబిడ్డ ఆల్ ఇండియా స్థాయిలో సివిల్స్ ర్యాంక్ సాధించడంపై జిల్లావాసులు అభినందించారు. జిల్లా బిడ్డకి మీరు CONGRATULATIONS చెప్పేయండి.
News April 23, 2025
MNCL: GRAEAT.. అస్మితకు 994 మార్కులు

రైతు బిడ్డ అస్మిత ఇంటర్ ఫలితాల్లో సత్తాచాటి అందరి మన్ననలు పొందింది. దండేపల్లి మండలం గుడిరేవు గ్రామానికి చెందిన రైతు చిట్ల రమణ-సునీతల కూతురు అస్మిత ఇంటర్ సెకండియర్ ఎంపీసీ విభాగంలో 1000కి 994 మార్కులు సాధించి అందరికి ఆదర్శంగా నిలిచింది. అస్మిత లక్షెట్టిపేట ప్రభుత్వ వెల్ఫేర్ కాలేజీలో చదివి కళాశాల, తల్లిదండ్రులకి మంచి పేరు తెచ్చింది. కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఇంజినీరింగ్ చేయడం తన లక్ష్యమని పేర్కొంది.
News April 23, 2025
NZB: బీసీ గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలు

బీసీ గురుకుల జూనియర్ కాలేజీల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. వచ్చే నెల 12వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 130 కాలేజీలు బాలురకు 127 కాలేజీలు బాలికలకు ఉన్నాయి. మరిన్ని వివరాలకు https://mjpabcwreis.cgg.gov.in/ TSMJBCWEB/లేదా 040-23328266 నంబర్‌ను సంప్రదించగలరు.