News March 28, 2024

తీర్పు రిజర్వ్

image

లిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపుపై రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు ముగిశాయి. కేజ్రీవాల్‌ను మరో 7 రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరింది. తనపై ఆరోపణలు లేకున్నా అరెస్ట్ చేశారని కేజ్రీవాల్ స్వయంగా వాదించారు. ఇరువైపులా వాదనలు విన్న జడ్జి కావేరీ బవేజా తీర్పును రిజర్వ్ చేశారు.

Similar News

News November 6, 2024

US POLLS: ట్రంప్ రెండు, కమల ఒకచోట గెలుపు

image

అమెరికాలో రాష్ట్రాలవారీగా పోలింగ్ పూర్తవుతోంది. దీంతో ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. తాజాగా ఇండియానా(11 ఎలక్టోరల్ ఓట్లు), కెంటకీ(8 ఎలక్టోరల్ ఓట్లు)లో ట్రంప్ విజయం సాధించారు. వెర్మాంట్‌లో కమలా హారిస్(3 ఎలక్టోరల్ ఓట్లు) గెలుపొందారు. అంతకుముందు డిక్స్‌విల్లే నాచ్‌లో చెరో 3 ఎలక్టోరల్ ఓట్ల చొప్పున గెలవడంతో టై అయింది. తొలుత మేజిక్ ఫిగర్ 270 ఎలక్టోరల్ ఓట్లు ఎవరు సాధిస్తారో వారిదే అధ్యక్ష పీఠం.

News November 6, 2024

తెలంగాణలో ఇవాళ్టి నుంచి కులగణన

image

TG: ఇవాళ్టి నుంచి కులగణన ప్రారంభం కానుంది. ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, భూమి, రుణాలు, వ్యవసాయం, స్థిరాస్తి, రేషన్ సహా పలు అంశాలపై వివరాలు సేకరిస్తారు. దాదాపు 85 వేల మంది ఎన్యుమరేటర్లు ఇంటింటికీ తిరిగి వివరాలు నమోదు చేస్తారు. 10 మంది ఎన్యుమరేటర్లకు ఒక పరిశీలకుడిని నియమించగా, 10% కుటుంబాలను వీరు మరోసారి సర్వే చేస్తారు. ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

News November 6, 2024

ఇవాళ్టి నుంచి ఆందోళనలు: షర్మిల

image

AP: విద్యుత్ సర్దుబాటు ఛార్జీలను వెంటనే రద్దు చేయాలనే డిమాండ్‌తో PCC చీఫ్ షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఇవాళ్టి నుంచి 3 రోజులు ఆందోళనలు చేపట్టనున్నాయి. ‘ఛార్జీల పెంపు పాపం వైసీపీదని, కూటమికి సంబంధం లేదని చెప్పడం సరికాదు. అధికారంలోకి వచ్చాక ఒక్క రూపాయి కూడా ఛార్జీలు పెంచబోమని ఇచ్చిన హామీని చంద్రబాబు నిలబెట్టుకోవాలి’ అని ఆమె సూచించారు. విజయవాడ ధర్నాచౌక్‌లో జరిగే నిరసనలో షర్మిల పాల్గొంటారు.