News April 22, 2025
MHBD: ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన మోడల్ కాలేజ్ విద్యార్థులు

ఇంటర్ పరీక్షల ఫలితాల్లో మోడల్ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఉత్తమ ఫలితాలతో రాష్ట్రంలోనే మెరుగైన స్థానంలో నిలిచారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులలో బి.సాయి సుష్మ 462/470 (ఎంపీసీ), జె.మధుమిత 426/470(బైపీసీ), ఏ.శ్రీలక్ష్మి 447/500( సీఈసీ), విద్యార్థులను ప్రిన్సిపల్ జి.ఉపేందర్ రావు, ఉపాధ్యాయ బృందం అభినందించారు.
Similar News
News April 23, 2025
గుంటూరు యువకుడిపై కడప యువతి ఫిర్యాదు

సోషల్ మీడియా పరిచయం పెళ్లి వరకు వెళ్లి మనస్పర్థల కారణంగా నిలిచిపోయింది. అయినప్పటికీ గుంటూరుకు చెందిన ఇమ్రాన్ తనను వేధిస్తున్నాడని బాధిత యువతి కడప పోలీసులకు ఫిర్యాదు చేసింది. పార్లర్ నిర్వహించే కడప యువతికి గుంటూరుకు చెందిన ఇమ్రాన్‌తో సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి దూరంగా ఉంటున్నప్పటికీ ఇమ్రాన్ తనకు ఫొటోలు పంపి వేధిస్తున్నాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది.
News April 23, 2025
నల్గొండ: రోడ్డుప్రమాదంలో యువకుడి మృతి

తిప్పర్తిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రవి అనే యువకుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలిలా.. నర్సింగ్ బట్లకి చెందిన రవి (30) పెళ్లి మండపం కట్టడానికి మంగళవారం రాత్రి మిర్యాలగూడ వెళ్లాడు. ఈ తెల్లవారుజామున బైక్‌పై తిరిగి వస్తుండగా డివైడర్‌ను ఢీకొట్టి కిందపడ్డాడు. అతని పైనుంచి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నల్గొండ ఆస్పత్రికి తరలించారు.
News April 23, 2025
HYD: హైవేలపై మంచినీళ్లు ప్లీజ్..!

HYDలోని కొన్ని ప్రాంతంలో మాత్రమే జలమండలి ఫ్రీ వాటర్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. నగరంలో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత, మరోవైపు ఉక్కపోతతో గొంతెండి పోతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని ప్రధాన రహదారుల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎండ తీవ్రతకు అనేక మంది ప్రయాణికులు తట్టుకోలేకపోతున్నట్లు పేర్కొన్నారు.