News April 22, 2025
కాట్రేనికోన: క్యాథలిక్ గురువు ఫ్రాన్సిస్‌కు చిత్ర నీరాజనం

క్యాథలిక్కుల అత్యున్నత మత గురువు పోప్ ఫ్రాన్సిస్ తన యావత్తు జీవితాన్ని ప్రభువు సేవకై అంకితం చేశారు. సువార్త విలువలతో జీవించాలని ప్రబోధనలు చేస్తూ..ఏసుక్రీస్తుకు నిజమైన శిష్యుడిలా జీవించిన పోప్ ఫ్రాన్సిస్ అందరినీ దుఃఖ సాగరంలో ముంచి ప్రభువు వద్దకు చేరుకున్నారు. కాట్రేనికోనకు ప్రముఖ చిత్రకారుడు అంజి ఆకొండి ఫ్రాన్సిస్ చిత్రాన్ని అద్భుతంగా మలిచి అతని మృతికి చిత్ర నీరాజనం అర్పించారు.
Similar News
News April 23, 2025
సివిల్ సర్వీసెస్‌లో వంగూరు వాసి సత్తా

వంగూర్ మండలం తిప్పారెడ్డిపల్లికి చెందిన గోకమోళ్ల ఆంజనేయులు మంగళవారం విడుదల చేసిన సివిల్స్ ఫైనల్ ఫలితాల్లో 934 ర్యాంకు సాధించారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆంజనేయులు కష్టపడి చదివి ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ ర్యాంకు సాధించడం పట్ల తిప్పారెడ్డిపల్లి గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. ఆంజనేయులు గ్రామంలోని యువతకు ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు.
News April 23, 2025
ఖమ్మం: కేయూ పీజీ పరీక్షలు వాయిదా

ఈనెల 26న ప్రారంభం కావాల్సిన వరంగల్ కాకతీయ యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్ (రెగ్యులర్) 4వ సెమిస్టర్ పరీక్షలు జూన్ 6కు వాయిదా పడ్డాయి. మే 1 నుంచి మే 31 వరకు వేసవి సెలవులను ప్రకటించిన నేపథ్యంలో పరీక్షలు వాయిదా పడ్డాయని రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం మంగళవారం తెలిపారు. ఏప్రిల్ 23 నుంచి 30 వరకు ప్రయోగ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
News April 23, 2025
ADB: ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన ప్రణయ్

ఇంటర్ ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సదాలి ప్రణయ్ సత్తా చాటాడు. ద్వితీయ సంవత్సరం MPC విభాగంలో 1000కి 991 మార్కులు సాధించి ఔరా అనిపించాడు. భోరజ్ మండలం గిమ్మ గ్రామానికి సదాలి బాపన్న-గంగమ్మ దంపతుల కుమారుడు ప్రణయ్. ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చడంతో యువకుడిని గ్రామస్థులు అభినందించారు.