News April 22, 2025

సివిల్స్ ర్యాంక్ కొట్టిన షాద్‌నగర్ యువతి

image

UPSCలోనూ మన రంగారెడ్డి జిల్లా వాసులు రాణించారు. షాద్‌నగర్‌లోని టీచర్స్‌కాలనీకి చెందిన రాఘవేందర్ రావు కుమార్తె ఇంద్రార్చిత కొంతకాలంగా సివిల్స్‌‌‌కు ప్రిపేర్ అవుతున్నారు. తాజాగా విడుదలైన UPSC ఫలితాల్లో 739 ర్యాంక్ సాధించారు. పట్టుదలతో చదివి ర్యాంక్ సాధించడం పట్ల షాద్‌నగర్ వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఆల్ ఇండియాలో రంగారెడ్డి జిల్లా యువత మెరుగైన ఫలితాలు సాధించడం విశేషం.

Similar News

News April 23, 2025

NZB: తల్లికి క్యాన్సర్.. కొడుకు ఆత్మహత్య

image

తల్లి క్యాన్సర్‌తో బాధపడుతూ ఉండటంతో మనస్తాపం చెందిన కొడుకు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన డిచ్‌పల్లిలో మంగళవారం వెలుగు చూసింది. ఎస్ఐ షరీఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. కమలాపూర్ గ్రామానికి చెందిన కర్రినోల్ల భూలక్ష్మి కొన్ని సంవత్సరాలుగా కాన్సర్‌తో పడపడుతుంది. ఇది జీర్ణించుకోలేక కొడుకు రంజిత్(28) ఈ నెల 21న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు పోలీసులు వివరించారు.

News April 23, 2025

నిర్మల్: ఇంటర్ ఫలితాల్లో మారిన జిల్లాస్థానం

image

ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లా ఉత్తీర్ణత స్థానంలో మార్పు సాధించింది. గతేడాది ఫస్టియర్‌లో నిర్మల్ జిల్లా 56% ఉత్తీర్ణతతో 16వ స్థానంలో నిలువగా ఈసారి 70.87%తో 17వ స్థానానికి చేరింది. సెకండియర్‌లో గతేడాది 66% ఉత్తీర్ణతతో 12వ స్థానంలో ఉండగా.. ఈసారి 58.78% ఉత్తీర్ణతతో పదో స్థానం కైవసం చేసుకుంది.

News April 23, 2025

జన్నారం: గంజాయి రవాణా చేస్తున్న నలుగురి అరెస్ట్

image

జన్నారం మండలం పొనకల్‌కు చెందిన రాజేశ్, సమీర్, వినయ్, మందపల్లికి చెందిన బాలాజీ గంజాయి రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నట్లు ఎస్సై రాజవర్ధన్ తెలిపారు. వారి నుంచి1.020 కిలోల గంజాయి, రూ.50 వేల నగదు, హోండా యాక్టివా, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. గంజాయి రవాణా చేసిన తాగిన చర్యలు తప్పవన్నారు.

error: Content is protected !!