News March 28, 2024
ఆ రూ.100 కోట్లు ఎక్కడికి పోయాయి?: కేజ్రీవాల్
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తనను ఇరికించడమే ఈడీ లక్ష్యమని సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. రౌస్ అవెన్యూ కోర్టులో సొంతంగా వాదనలు వినిపిస్తూ.. ‘ఈ కేసులో సీబీఐ 31 వేల పేజీలు, ఈడీ 21 వేల పేజీలతో ఛార్జ్‌షీట్ దాఖలు చేశాయి. అందులో ఎక్కడా నా పేరు లేదు. మాగుంట రాఘవరెడ్డి ఇచ్చిన 7 వాంగ్మూలాలలో ఆరింట్లో నా పేరు లేదు. లిక్కర్ కేసులో రూ.100 కోట్ల అవినీతి జరిగిందంటున్నారు.. మరి ఆ డబ్బు ఎక్కడుంది?’ అని ప్రశ్నించారు.
Similar News
News November 6, 2024
ఇవాళ్టి నుంచి ఆందోళనలు: షర్మిల
AP: విద్యుత్ సర్దుబాటు ఛార్జీలను వెంటనే రద్దు చేయాలనే డిమాండ్‌తో PCC చీఫ్ షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఇవాళ్టి నుంచి 3 రోజులు ఆందోళనలు చేపట్టనున్నాయి. ‘ఛార్జీల పెంపు పాపం వైసీపీదని, కూటమికి సంబంధం లేదని చెప్పడం సరికాదు. అధికారంలోకి వచ్చాక ఒక్క రూపాయి కూడా ఛార్జీలు పెంచబోమని ఇచ్చిన హామీని చంద్రబాబు నిలబెట్టుకోవాలి’ అని ఆమె సూచించారు. విజయవాడ ధర్నాచౌక్‌లో జరిగే నిరసనలో షర్మిల పాల్గొంటారు.
News November 6, 2024
ఫోన్ ఛార్జింగ్‌లో ఈ జాగ్రత్తలు తీసుకోండి
చాలామంది ఫోన్ ఛార్జింగ్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. అది ఫోన్ల పేలుళ్లకు దారితీసే ప్రమాదం ఉంది. అందుకే ఈ జాగ్రత్తలు పాటించండి.
* రాత్రంతా ఛార్జింగ్ పెట్టొద్దు. ఫోన్‌ను బట్టి ఫుల్ ఛార్జ్ అవ్వడానికి పట్టే సమయాన్ని తెలుసుకొని, అంతసేపే ఛార్జింగ్ పెట్టాలి.
* ప్లగ్ ఇన్ చేసి ఫోన్ మాట్లాడటం, చాటింగ్ చేయొద్దు.
* వంటగదుల్లో ఛార్జింగ్ పెట్టొద్దు.
* ఫుల్ ఛార్జ్ అయినా స్విచ్ ఆఫ్ చేయకపోవడం ప్రమాదకరం.
News November 6, 2024
IPL వేలంలోకి అండర్సన్
ఇంగ్లండ్ స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్ IPL మెగా వేలంలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. రూ.1.25 కోట్ల బేస్ ప్రైస్‌తో తన పేరును రిజిస్టర్ చేయించుకున్నారు. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ 42 ఏళ్ల ఆటగాడు చివరిసారి 2011, 2012లో వేలంలో పాల్గొనగా ఎవరూ కొనుగోలు చేయలేదు. దీంతో ఆ తర్వాత అండర్సన్ IPL వైపు తొంగిచూడలేదు. ఇప్పుడు 13 ఏళ్ల తర్వాత IPLలోకి అడుగుపెట్టాలని చూస్తున్నారు.