News April 22, 2025

గట్టు జూనియర్ కాలేజీలో మెరిసిన మాణిక్యం

image

గట్టు మండల కేంద్రంలోని ప్రభుత్వ గురుకుల జూనియర్ కాలేజీలో చదువుతున్న మహిన్ జవేరియా ఈ ఏడాది విడుదలైన ఇంటర్ ఫలితాల్లో 440లో 432 మార్కులు సాధించి ప్రతిభను చాటింది. చిన్న కిరాణా షాప్ నడుపుకుంటూ విద్యను ప్రోత్సహించిన తల్లిదండ్రుల ఆత్మీయతకు మంచి ఫలితం వచ్చిందని గ్రామస్థులు తెలిపారు. మహిన్ సాధనకు ప్రశంసలు వెల్లువెత్తాయి. గ్రామస్థులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపి స్వీట్లు పంపించి అభినందనలు తెలిపారు.

Similar News

News April 18, 2026

వార్ టెన్షన్.. నౌకల కోసం ₹12,980కోట్లతో స్కీమ్!

image

గ్లోబల్ ట్రేడ్ సాఫీగా సాగేందుకు నౌకలకు రక్షణ లభించేలా ₹12,980కోట్లతో భారత్ మారిటైమ్ ఇన్సూరెన్స్ పూల్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పశ్చిమాసియా యుద్ధ పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం భారతీయ నౌకలు విదేశీ ఇన్సూరెన్స్ కంపెనీలపై ఆధారపడుతున్నాయి. అయితే కవరేజ్ సరిగ్గా లేకపోవడం, యుద్ధాలకు ఇన్సూరెన్స్ వర్తించకపోవడం, లీగల్ సమస్యలు వంటి సవాళ్ల నేపథ్యంలో దీనిని తీసుకొచ్చింది.

News April 18, 2026

జగిత్యాలకు త్వరలోనే పాస్‌పోర్ట్ సేవా కేంద్రం

image

జగిత్యాలలో త్వరలోనే పాస్‌పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటు కానుందని ఎంపీ అరవింద్ తెలిపారు. ఈ మేరకు విదేశాంగ శాఖ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్‌కు ఆయన వినతి పత్రం అందజేశారు. జగిత్యాల ప్రజల దీర్ఘకాలిక డిమాండ్‌ను ఆయన దృష్టికి తీసుకెళ్లగా.. అవసరాన్ని గుర్తించి సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ పేర్కొన్నారు. పాస్‌పోర్ట్ సేవలు మరింత సులభం అవుతాయన్నారు. మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ భోగ శ్రావణి పాల్గొన్నారు.

News April 18, 2026

డీలిమిటేషన్ బిల్లు ప్రజాస్వామ్యానికి ముప్పు: ఎమ్మెల్యే కూనంనేని

image

డీలిమిటేషన్ బిల్లు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పు అని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో నియంతృత్వ ధోరణితో ఈ బిల్లును ప్రవేశపెట్టిందని ఆయన ఆరోపించారు. అయితే, ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఈ బిల్లును అడ్డుకోవడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడాయని కొనియాడారు. నియంతృత్వ పోకడలపై ప్రజాస్వామ్యం సాధించిన విజయమని అభివర్ణించారు.