News April 22, 2025
సిద్దిపేట: ఈతకు వెళ్లి యువకుడు మృతి

చెరువులోకి ఈతకు వెళ్లిన వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం కమ్మర్‌పల్లిలో చోటుచేసుకుంది. గ్రామస్థుల వివరాలిలా.. మండలంలోని పెద్ద చీకోడు గ్రామానికి చెందిన తౌడ బాబు(22) కమ్మరపల్లి పెద్ద చెరువులో ఈతకు వెళ్లి మృతి చెందాడని తెలిపారు. మృతదేహం వద్ద కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 12, 2026
అనంతపురంలో మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ

అనంతపురంలోని రూడ్ సెట్ సంస్థలో ఫిబ్రవరి 5 నుంచి మార్చి 7 వరకు నెల రోజుల పాటు మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. 19 నుంచి 50ఏళ్ల వయసున్న గ్రామీణ నిరుద్యోగ మహిళలు దీనికి అర్హులు. శిక్షణ కాలంలో వసతి, భోజన సౌకర్యాలు ఉచితంగా కల్పిస్తామని పేర్కొన్నారు. ఆసక్తి గల మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
News January 12, 2026
భర్త ఇంటి ముందు భార్య ఆందోళన

తాను ఉండగా మరో మహిళతో కాపురం పెట్టిన భర్త ఇంటి ముందు భార్య నిరసనకు దిగింది. బాధితురాలి వివరాలు.. ఖమ్మం (D)కు చెందిన సాయిచరణ్‌కు 15ఏళ్ల క్రితం శిల్పతో వివాహమైంది. ఇద్దరు పిల్లలున్నారు. ఐదేళ్లుగా భార్యను వదిలేసిన అతను కీసర అహ్మద్ గూడలో ఉంటున్నట్లు తెలుసుకున్న శిల్ప అక్కడికి చేరుకుంది. ఇంట్లోకి రానివ్వకపోవడంతో బయటే కూర్చుంది. పోలీసులను ఆశ్రయించిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది.
News January 12, 2026
లాభాల్లోకి స్టాక్ మార్కెట్స్

నష్టాలతో మొదలైన భారత స్టాక్ మార్కెట్ సూచీలు తిరిగి పుంజుకున్నాయి. ప్రారంభ సమయంలో సెన్సెక్స్ 500 పాయింట్లు, నిఫ్టీ 127 పాయింట్లు కోల్పోయింది. అలాంటి పరిస్థితి నుంచి సెన్సెక్స్ 60కి పైగా పాయింట్లు లాభపడి 83,640 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 40కి పైగా పాయింట్లు ఎగబాకి 25,725 వద్ద కొనసాగుతోంది.


