News April 22, 2025
ఇల్లందకుంట ఆలయ ఆదాయ వివరాలు

ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో 2025 శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల హుండీ లెక్కింపు మంగళవారం ఉదయం 9గంటలకు జరిగింది. ఈ సందర్భంగా రూ.20,69,829 నగదు, 12గ్రా. బంగారం, 305గ్రా. వెండి, 225 డాలర్లు, ఇతర విదేశీ కరెన్సీ లభించాయి. ఈసారి గతేడాదితో పోలిస్తే రూ.2.94 లక్షలు అధికంగా ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News February 24, 2026
KNR: డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం

భద్రతపై అవగాహన కల్పించే ‘అరైవ్ అలైవ్’లో భాగంగా ఈ నెల 27న వాహన చోదకులకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. కరీంనగర్ కమిషనరేట్‌లో ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ప్రమాదాల నివారణలో కంటిచూపు కీలకమని, ఆర్టీసీ, ఆటో, ఇతర వాహన డ్రైవర్లు పోలీసు ప్రధాన కార్యాలయం పక్కన గల అస్త్ర కన్వెన్షన్ హాల్‌లో ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరారు.
News February 24, 2026
కరీంనగర్: జర్నలిస్టుల డైరీని ఆవిష్కరించిన కలెక్టర్

తెలంగాణ జర్నలిస్టు ఫెడరేషన్ డైరీని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉన్న జర్నలిస్టుల పాత్ర గొప్పదని అన్నారు. జర్నలిస్టుల డైరీ తన చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు పాల్గొన్నారు.
News February 24, 2026
KNR: డిజిటల్ జూదం.. పోలీసులకు సవాల్!

కరీంనగర్ జిల్లాలో పేకాటరాయుళ్లు పంథా మార్చారు. పోలీసులకు చిక్కకుండా ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్‌ల ద్వారా నగదు బదిలీ చేస్తూ జూదం ఆడుతున్నారు. శివారు ప్రాంతాల్లోని తోటలు, కోళ్ల ఫారాలను అడ్డాలుగా మార్చుకొని.. బయట కాపలాదారులు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. గత మూడేళ్లలో 1,433 మందిని పోలీసులు పట్టుకున్నా.. తాజా సాంకేతిక పోకడలు, పక్కా నిఘా వ్యవస్థ వారికి సవాలుగా మారాయి.


