News March 28, 2024

తెల్లం రాజ్యలక్ష్మి ఎస్టీ కాదని పిటిషన్.. హైకోర్టులో విచారణ

image

AP: పోలవరం YCP ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. తప్పుడు కుల ధ్రువీకరణ పత్రంతో ఆమె ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని పిటిషనర్ మడకం వెంకటేశ్వరరావు తరఫు లాయర్ వాదించారు. కలెక్టర్ జారీ చేయాల్సిన ఎస్టీ సర్టిఫికెట్‌ను బుట్టాయిగూడెం తహసీల్దార్ జారీ చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని అధికారులను ధర్మాసనం ఆదేశించింది.

Similar News

News November 4, 2025

122 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

ముంబైలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (<>NPCIL<<>>) 122 డిప్యూటీ మేనేజర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 7 నుంచి 27 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. డిప్యూటీ మేనేజర్ పోస్టుకు నెలకు రూ.56,100, జూనియర్ ట్రాన్స్‌లేటర్ పోస్టుకు నెలకు రూ.35,400 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://npcilcareers.co.in

News November 4, 2025

మంత్రి అజహరుద్దీన్‌కు శాఖల కేటాయింపు

image

TG: ఇటీవల మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అజహరుద్దీన్‌కు ప్రభుత్వం శాఖలు కేటాయించింది. ఆయనకు ప్రభుత్వ రంగ సంస్థలు (పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్), మైనారిటీ వెల్ఫేర్ శాఖలు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కాగా ఆయనకు హోంశాఖ ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆ శాఖను సీఎం రేవంత్ అజహరుద్దీన్‌కు ఇవ్వలేదు.

News November 4, 2025

రేపు వరల్డ్ కప్ విజేతలకు PM ఆతిథ్యం

image

ICC ఉమెన్ వరల్డ్ కప్-2025 కైవసం చేసుకున్న భారత క్రికెటర్ల బృందానికి ప్రధాని నరేంద్ర మోదీ రేపు(NOV 5న) ఆతిథ్యం ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన ఆహ్వానాన్ని PMO బీసీసీఐకి పంపింది. ఈరోజు సాయంత్రం హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో క్రికెటర్లు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆదివారం ఉత్కంఠగా జరిగిన పైనల్లో టీమ్ ఇండియా సౌత్ ఆఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి చిరకాల స్వప్నం వరల్డ్ కప్‌ను సాధించడం తెలిసిందే.