News April 22, 2025
అనకాపల్లి: ‘ఆధునిక సాంకేతికతను వినియోగించాలి’

నేరాలు నియంత్రణకు ఆధునిక సాంకేతికతను వినియోగించాలని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి సూచించారు. రేంజ్ కార్యాలయంలో నిర్వహించిన క్రైమ్ సమీక్షలో అనకాపల్లి ఎస్పీ తుహీన్ సిన్హా పాల్గొన్నారు. ప్రజలు సైబర్ మోసాల బారిన పడకుండా ఉండేందుకు ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్ 1930 ప్రజలు వినియోగించుకునే విధంగా చూడాలన్నారు. డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయాలన్నారు.
Similar News
News April 23, 2025
సివిల్స్‌లో వెల్దండ యశ్వంత్‌కు 432వ ర్యాంకు

వెల్దండ మండలం పోచమ్మగడ్డ తండాకు చెందిన యశ్వంత్ నాయక్ సివిల్స్ ఫలితాల్లో 432వ ర్యాంకు సాధించాడు. గత సంవత్సరం సివిల్స్ రాయగా 627వ ర్యాంకు సాధించిన యశ్వంత్ ప్రస్తుతం ఐపీఎస్ శిక్షణ పొందుతున్నాడు. తిరిగి పరీక్ష రాయగా ఈసారి మంచి ర్యాంక్ సాధించాడని తల్లిదండ్రులు ఉమాపతి నాయక్, పద్మ సంతోషం వ్యక్తం చేశారు. యశ్వంత్‌ను కుటంబీకులు, మిత్రులు అభినందించారు.
News April 23, 2025
హయత్‌నగర్: హిజ్రాలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

రాత్రి వేళలో ఔటర్ రింగ్ రోడ్ల వెంట ఉంటూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న హిజ్రాలను హయత్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అనంతరం మెట్ తహశీల్దార్‌కు బైండ్ ఓవర్ చేశారు. ఈ సందర్భంగా సీఐ నాగరాజుగౌడ్ మాట్లాడుతూ.. ఎవరైనా రోడ్ల వెంట అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ వసూళ్లకు పాల్పడినా, వచ్చి పోయేవారికి, వాహనదారులకు ఇబ్బందులకు గురి చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News April 23, 2025
ఒంగోలులో TDP నేత హత్య.. లోకేశ్ దిగ్ర్భాంతి

ఒంగోలులో టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య వార్త తనను షాక్‌కు గురిచేసిందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ‘వీరయ్య చౌదరిని దుండగులు అత్యంత కిరాతకంగా నరికి చంపడం దారుణం. యువగళం పాదయాత్రలో నాతోపాటు అడుగులు వేసిన వీరయ్య టీడీపీలో ఎంతో క్రియాశీలకంగా పనిచేశారు. హంతకులపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని లోకేశ్ ట్వీట్ చేశారు.