News April 22, 2025
త్వరలో 18 APPSC నోటిఫికేషన్లు: ప్రభుత్వం

AP: నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో 18 నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు APPSC రెడీగా ఉన్నట్లు వివరించింది. ఎస్సీ వర్గీకరణకు తగ్గట్లు రోస్టర్ పాయింట్లు ఉంటాయంది. ఈ 18 నోటిఫికేషన్లకు సంబంధించి ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 866 పోస్టులు భర్తీ చేయనున్నట్లు సమాచారం. ఇటీవల ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
Similar News
News August 7, 2025
జిల్లాల్లో మార్పులపై నెలలో నివేదిక: CM

APలో కొత్త జిల్లాలు, మండలాలు, సరిహద్దుల మార్పులపై ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని CM చంద్రబాబు ఆదేశించారు. సరిహద్దు మండలాల విలీన సమస్యకు పరిష్కారం, కొత్త మండలాలు ఏర్పాటు, జిల్లా, మున్సిపాలిటీలు, మండలాలు, గ్రామాల సరిహద్దులు మార్పు వంటి వాటిపై ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించాలని సూచించారు. అక్టోబర్ ఆఖరులోపే ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు.
News August 7, 2025
రాజగోపాల్ రెడ్డికి నోటీసులు?

TG: సీఎం రేవంత్ రెడ్డిపై పదేపదే బహిరంగ విమర్శలు చేస్తున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేయనుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ రాజగోపాల్ రెడ్డితో క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి భేటీ కానున్నారు. రేవంత్‌పై విమర్శల మీద వివరణ కోరనున్నారు. ఆయనతో మాట్లాడిన తర్వాత ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు.
News August 7, 2025
బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్డు తింటే ఎన్ని లాభాలో..

ప్రతిరోజు బ్రేక్‌ఫాస్ట్‌లో కోడిగుడ్డు ఉండేలా చూసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. గుడ్లలో హై క్వాలిటీ ప్రోటీన్ ఉంటుందని, దీని వల్ల కడుపు నిండిన భావన కలుగుతుందని తెలిపారు. అలాగే B12, D, A, E, B6 విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. కండరాల బలం, కంటి చూపు, మెదడు, కాలేయం ఆరోగ్యం కోసం ఇవి ఎంతో ముఖ్యం. అయితే ఖాళీ కడుపుతో కాకుండా అల్పాహారంతో కలిపి తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
SHARE IT