News April 22, 2025

J&Kలో ఉగ్రదాడి.. ఖండించిన సీఎంలు

image

J&Kలో జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో పర్యాటకులు మృతి చెందిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. ‘ఈ దుశ్చర్యను ఖండిస్తున్నాను. ఇలాంటి దొంగ దెబ్బలతో భారతీయుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు. ఉగ్రవాద మూకల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని కేంద్రాన్ని కోరుతున్నా’ అని పేర్కొన్నారు. అమాయక పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేయడం హేయమైన చర్య అని ఏపీ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.

Similar News

News August 7, 2025

భర్తకు భార్య రాఖీ కట్టొచ్చా?

image

అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల పవిత్ర బంధానికి ప్రతీక రాఖీ. అయితే కేవలం సోదరులకే కాదు భర్తలకు రాఖీ కట్టే ఆచారాన్ని మధ్యప్రదేశ్ చింద్వాడా సహా పలు ప్రాంతాల్లో పాటిస్తున్నారు. ఇంద్రుడికి భార్య ఇంద్రాణి రాఖీ కట్టినట్లు పురాణాలు చెబుతున్నాయి. ‘పెళ్లంటే బాధ్యత. భార్యకు ఒక రక్షకుడిలా తోడుగా ఉంటానంటూ భర్త చేసే ప్రతిజ్ఞ’ అని గుర్తు చేస్తూ మహిళలు భర్తలకు రాఖీ కడుతుంటారు. మరి మీ దగ్గర ఈ పద్ధతి ఉందా? COMMENT

News August 7, 2025

దూర ప్రయాణాలు చేసే వారి కోసం త్వరలో ఎమినిటీ సెంటర్లు!

image

దేశవ్యాప్తంగా నేషనల్ హైవేల పక్కన 5వేల వేసైడ్ ఎమినిటీ(WSA) సెంటర్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దూర ప్రయాణాలు చేసే వారు, భారీ వాహనాల డ్రైవర్లు వీటిలో విశ్రాంతి తీసుకోవచ్చు. ప్రతి 30-40kmsకి ఒకటి చొప్పున ఏర్పాటు కానున్నాయి. ఈ కేంద్రాల్లో పార్కింగ్ స్థలం, ఫుడ్, ఫ్యూయెల్, టాయిలెట్లు వంటి సదుపాయాలు ఉంటాయి. ఇందుకు సంబంధించిన ముసాయిదాను ప్రభుత్వం గత వారం విడుదల చేసింది.

News August 7, 2025

జిల్లాల్లో మార్పులపై నెలలో నివేదిక: CM

image

APలో కొత్త జిల్లాలు, మండలాలు, సరిహద్దుల మార్పులపై ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని CM చంద్రబాబు ఆదేశించారు. సరిహద్దు మండలాల విలీన సమస్యకు పరిష్కారం, కొత్త మండలాలు ఏర్పాటు, జిల్లా, మున్సిపాలిటీలు, మండలాలు, గ్రామాల సరిహద్దులు మార్పు వంటి వాటిపై ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించాలని సూచించారు. అక్టోబర్ ఆఖరులోపే ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు.