News March 28, 2024
తాజ్‌మహల్‌ను శివాలయంగా ప్రకటించాలని పిటిషన్

తాజ్‌మహల్‌ను శివాలయంగా ప్రకటించాలని మరో పిటిషన్ దాఖలైంది. యోగేశ్వర్ శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంఘ్ ట్రస్ట్ అధ్యక్షుడు అజయ్ ప్రతాప్ UPలోని ఆగ్రా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజ్‌మహల్‌లో నిర్వహిస్తున్న ఇస్లామిక్ కార్యకలాపాలను నిలిపివేయాలని కోరారు. దీనిపై APR 9న విచారణ జరగనుంది. మహల్‌ను శివాలయంగా ప్రకటించాలని కోరుతూ ఇప్పటికే దాఖలైన పలు పిటిషన్లను కోర్టు కొట్టివేయగా, మరికొన్ని పెండింగ్‌లో ఉన్నాయి.
Similar News
News April 2, 2026
కరెంట్ అఫైర్స్

* డీజీసీఏ చీఫ్‌గా వీర్ విక్రమ్ యాదవ్ నియామకం
* AP: అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభలో ఆమోదం
* ‘పారాక్వాట్’ గడ్డిమందుపై తెలంగాణ తాత్కాలిక నిషేధం
* భారత్ తొలి డిజిటల్ సెన్సస్ ప్రారంభం
* గుజరాత్‌లో కేన్స్ సెమీకండక్టర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
* భారతీయ నేవీ అమ్ములపొదిలోకి సంశోధక్ సర్వే నౌక
* భారత్ వేదికగా మే నెలలో బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సదస్సు
News April 2, 2026
సేల్స్‌లో ఎలక్ట్రిక్ కార్ల వాటా 5శాతమే.. అదే కారణమా?

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్నా కార్లలో వీటి వాటా ఐదు శాతంలోపే ఉంది. FY26లో మొత్తం 2,29,000 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడుపోయాయి. అంతకుముందు ఏడాదితో (1,23,400 యూనిట్లు) పోలిస్తే వృద్ధి నమోదైనా ఆశించినంత వేగంగా సేల్స్ పెరగట్లేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఛార్జింగ్ స్టేషన్ల కొరత, కార్ రేంజ్ – రీసేల్ వ్యాల్యూపై అనుమానాలు ఇందుకు కారణమని పేర్కొంటున్నాయి.
News April 2, 2026
ఏప్రిల్ 2: చరిత్రలో ఈరోజు

* 1942: గణిత శాస్త్రవేత్త వశిష్ఠ నారాయణ సింగ్ జననం
* 1969: బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ జననం
* 1872: టెలిగ్రాఫ్ ఆవిష్కర్త సామ్యుల్ మోర్స్ మరణం
* 1933: క్రికెటర్ మహారాజా రంజిత్ సింహ్‌జీ మరణం (ఫొటోలో)
* 2011: వన్డే క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్ విజయం
* అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం
* వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే


