News April 22, 2025
నంద్యాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

☞ కర్నూలు జిల్లాలో ప్రమాదం.. తండ్రీకూతురి మృతి ☞ చాగలమర్రిలో ప్రభుత్వ లాంఛనాలతో రిటైర్డ్ జవాన్ అంత్యక్రియలు ☞ చేనేత కార్మికులకు మగ్గాలు పంపిణీ చేసిన మంత్రి బీసీ ☞ 1200 సూక్ష్మ చిత్రాలతో ప్రపంచ ధరిత్రి దినోత్సవం చిత్రం ☞ బేతంచర్లలో చిన్నారులను అభినందించిన డోన్ MLA ☞ గొడవను సర్దిచెప్పేందుకు వెళ్లిన వ్యక్తిని చితకబాదిన సంజామల పోలీసులు ☞ సౌభాగ్య రంగు పొడిని విక్రయిస్తే చర్యలు: ఆళ్లగడ్డ MRO
Similar News
News April 23, 2025
సూర్యాపేట: ఈతకు వెళ్లి బాలుడి మృతి

చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లిన బాలుడు మృతి చెందిన ఘటన సూర్యాపేట మండలం గాంధీనగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధీ నగర్‌కి చెందిన కిషోర్ కుమార్ (14)తో పాటు అతడి స్నేహితులు చెరువు వద్దకు వెళ్లారు. కిషోర్ ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడ్డాడు. ఈత రాకపోవడంతో నీట మునిగి మృతి చెందినట్లు ఎస్ఐ బాలునాయక్ తెలిపారు.
News April 23, 2025
MDCL: ITI సప్లమెంటరీ పరీక్షలు ప్రారంభం

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలో ITI సప్లమెంటరీ పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. మెకానికల్ డీజిల్ సహా ఇతర ట్రేడ్లకు సంబంధించిన విద్యార్థులు ‘ట్రేడ్ తీయరి’ సబ్జెక్టు పరీక్ష రాయగా, మంగళవారం ప్రశాంతమైన వాతావరణంలో పరీక్ష జరిగినట్లు పేర్కొన్నారు. సికింద్రాబాద్ ఇన్నో విజన్ టెక్నాలజీస్లో CBT పరీక్ష పూర్తైంది. మిగతా అన్ని బ్రాంచీలకు పరీక్ష పూర్తైన తర్వాత ఫలితాలు వస్తాయని అధికారులు తెలిపారు.
News April 23, 2025
నరసరావుపేట: ‘భార్యపై అనుమానంతో హత్య’

నరసరావుపేట మండలంలోని కేసానుపల్లి గ్రామానికి చెందిన చిమట శ్రీలక్ష్మి మృతిని రూరల్ పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు. మృతురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేసిన పోలీసులు.. ఆమె భర్త ఆంజనేయులతో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. భార్యపై అనుమానంతోనే భర్త ఈ దారుణానికి ఒడికట్టాడని పోలీసులు పేర్కొన్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.