News April 22, 2025

హైదరాబాద్‌లో CSIR స్టార్ట్‌అప్ కాంక్లేవ్

image

కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ హైదరాబాద్‌లో CSIR స్టార్ట్‌అప్ కాంక్లేవ్‌ను ప్రారంభించారు. CSIR లాబొరేటరీ IICT, CCMB, NGRI సంయుక్తంగా నిర్వహించిన ఈ కాంక్లేవ్‌లో 70కు పైగా స్టార్టప్‌లు తమ ఆవిష్కరణలు, ఉత్పత్తులు, ప్రదర్శించాయి. పరిశోధన, ఆవిష్కరణలకు వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి MP ఈటల రాజేందర్, ఉప్పల్ MLA బండారి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.

Similar News

News July 8, 2025

ఎంఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ జవాబు పత్రాల నకలుకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఓయూ పరిధిలోని ఎంఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షల జవాబు పత్రాల నకలు పొందేందుకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కోర్సు మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫలితాలను ఇప్పటికే విడుదల చేశామని చెప్పారు. జవాబు పత్రాల నకలు పొందేందుకు ఒక్కో పేపరు రూ.1,000 చొప్పున చెల్లించి వచ్చే నెల 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News July 8, 2025

బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ పరీక్షా ఫలితాల విడుదల

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఈ కోర్సు సెమిస్టర్ పరీక్షా ఫలితాలను విడుదల చేశామన్నారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.

News July 8, 2025

కాంగ్రెస్ HYD, RR జిల్లాలకు కొత్త ఇన్‌ఛార్జ్‌లు

image

TGలో కాంగ్రెస్ సంస్థాగత పునర్నిర్మాణం దిశగా కీలక అడుగు వేసింది. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ బలోపేతానికి చర్యలు చేపట్టింది. AICC TG ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆమోదంతో జిల్లాలకు కొత్త ఇన్‌ఛార్జ్‌లను నియమించారు. HYD జిల్లాకు జగ్గారెడ్డి, ఉమ్మడి RRకు శివసేనా రెడ్డిని నియమించారు. వీరి నియామకంతో అధికార పార్టీకి సిటీ, శివారులో పట్టు దొరుకుతుందని శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.