News April 22, 2025

వైసీపీ నుంచి దువ్వాడ శ్రీనివాస్‌ సస్పెండ్

image

AP: YCP నేత, MLC దువ్వాడ శ్రీనివాస్‌కు ఆ పార్టీ అధిష్ఠానం షాక్ ఇచ్చింది. మాజీ CM, ఆ పార్టీ అధినేత YS జగన్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ కార్యాలయం ప్రకటించింది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో, పార్టీ క్రమశిక్షణా కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో పేర్కొంది. దువ్వాడ కుటుంబ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.

Similar News

News January 11, 2026

మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు

image

TG: మేడారం జాతరకు వచ్చే భక్తులకు వైద్యపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. అన్ని రూట్లలో మెడికల్ క్యాంపులు ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి రాజనర్సింహ ఆదేశించారు. TTD కళ్యాణ మండపంలో 50 పడకలతో ప్రధాన ఆస్పత్రి, మరో రెండు చోట్ల మినీ హాస్పిటళ్లు, మొత్తం 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. 35 అంబులెన్సులు, 3,199 మంది సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు.

News January 11, 2026

2.9°Cకు పడిపోయిన ఉష్ణోగ్రతలు

image

దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. ఇవాళ ఢిల్లీ నగరంలో 4.8°C కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. చాలా ప్రాంతాల్లో 4°C కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణశాఖ తెలిపింది. అటు సౌత్ ఢిల్లీలోని అయా నగర్‌లో 2.9°C ఉష్ణోగ్రతతో ప్రజలు వణికిపోయారు. గరిష్ఠ ఉష్ణోగ్రత 16 డిగ్రీల వద్దే ఉంటుందని పేర్కొంటూ IMD ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

News January 11, 2026

కోడి పందేలను అడ్డుకోవడం సాధ్యమేనా?

image

AP: సంక్రాంతికి కోడి పందేలను, జూదాన్ని అడ్డుకోవాలని <<18824857>>హైకోర్టు<<>> ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే సంక్రాంతి అంటే పిండి వంటలే కాదు కోడి పందేలు కూడా మన సంప్రదాయమేనని కొందరు వాదిస్తుంటారు. ఏటా సంక్రాంతికి వీటిపై ఆంక్షలు పెట్టినా కట్టడి చేయడం అంత సులభమయ్యేది కాదు. ఈసారి స్వయానా Dy.CM పవన్ సైతం సంక్రాంతి అంటే జూదం అన్న భావన మారాలని పేర్కొన్నారు. మరి ఈ సంక్రాంతికి కోడిపందేలను అడ్డుకోవడం సాధ్యమేనా? Comment.