News April 23, 2025

వికారాబాద్: సంక్షేమ పథకాలు సమర్ధవంతంగా అమలు చేయాలి: కలెక్టర్ ప్రతీక్ జైన్

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను పారదర్శకంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు. మంగళవారం సచివాలయం నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ఉన్నతాధికారులతో కలిసి రెవెన్యూ గృహ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భూభారతి, ఇందిరమ్మ ఇళ్లు, ఎల్ఆర్ఎస్ పథకాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

Similar News

News April 23, 2025

10th RESULTS: మొదటి స్థానంలో పార్వతీపురం మన్యం జిల్లా

image

పదో తరగతి పరీక్షా ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 10,286 మంది పరీక్ష రాయగా 9,659 మంది పాసయ్యారు. 5,009 మంది బాలురులో 4,617(92.17%) మంది, 5,277 మంది బాలికలు పరీక్ష రాయగా 5,042(95.55%) మంది పాసయ్యారు. 93.90% పాస్ పర్సంటైల్‌తో రాష్ట్రంలో పార్వతీపురం మన్యం జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. గతేడాది కూడా టాప్‌లోనే ఉంది.

News April 23, 2025

10th RESULTS: 4వ స్థానంలో గుంటూరు జిల్లా

image

పదో తరగతి పరీక్షా ఫలితాల్లో గుంటూరు జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 27,255 మంది పరీక్ష రాయగా 24,129 మంది పాసయ్యారు. 14444 మంది బాలురులో 12567 మంది, 12811 మంది బాలికలు పరీక్ష రాయగా 11562 మంది పాసయ్యారు. 88.53 పాస్ పర్సంటైల్‌తో జిల్లా రాష్ట్రంలో 4వ స్థానంలో నిలిచింది.

News April 23, 2025

కరోనాను జయించి.. IASగా సత్తా

image

తాజా UPSC ఫలితాల్లో నారాయణవనం మండల వాసి సురేశ్ 988 ర్యాంక్‌తో సత్తా చాటిన విషయం తెలిసిందే. 2021లో ఆయన కరోనా బారిన పడ్డారు. కోలుకునే క్రమంలో వినికిడి సమస్యను ఎదుర్కొన్నారు. అయినా పట్టు వదలని ఆయన ఏడో ప్రయత్నంలో అనుకున్నది సాధించారు. స్వామి వివేకానంద, అబ్దుల్ కలాం అంటే ఇష్టం అన్న ఆయన.. సమాజానికి తన వంతు కృషి చేస్తానన్నారు.

error: Content is protected !!