News April 23, 2025
పహల్గాం ఉగ్రదాడి అమానుషం: రాష్ట్రపతి

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడిని రాష్ట్రపతి ముర్ము ఖండించారు. ఆ ఘటన చాలా బాధ కలిగించిందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘ఉగ్రదాడి గురించి తెలిసి షాక్‌కు గురయ్యాను. ఇది పిరికిపంద చర్య. అందరూ ముక్తకంఠంతో ఖండించాలి. అమాయక పౌరులపై దాడి చేయడం క్షమార్హం కాదు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం’ అని తెలిపారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ ఉగ్రదాడిని ఖండించారు.
Similar News
News April 23, 2025
టెన్త్ ఫలితాలు.. 81.14% ఉత్తీర్ణత

AP: పదో తరగతి ఫలితాల్లో 81.14% ఉత్తీర్ణత నమోదైనట్లు మంత్రి లోకేశ్ ప్రకటించారు. మొత్తం 6,14,459 మంది పరీక్షలు రాయగా, 4,98,585 మంది పాసైనట్లు తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా (93.90%) తొలి స్థానంలో, అల్లూరి సీతారామరాజు జిల్లా (47.64%) చివరిస్థానంలో నిలిచాయి. రెసిడెన్షియల్ స్కూళ్లు అత్యధిక ఉత్తీర్ణత శాతం (95.02%) సాధించాయి.
News April 23, 2025
BIG BREAKING: టెన్త్ ఫలితాలు విడుదల

AP: టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి లోకేశ్ X వేదికగా ఫలితాలను ప్రకటించారు. Way2News యాప్ ఓపెన్ చేయగానే కనిపించే స్క్రీన్‌లో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి మీ రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. ఆ మార్క్స్ జాబితాను సులభంగా ఇతరులకు షేర్ చేయొచ్చు.
SHARE IT
News April 23, 2025
పహల్‌గామ్ ఉగ్రదాడికి సూత్రధారి ఇతడేనా?

J&K పహల్‌గామ్ ఉగ్రదాడి వెనుక లష్కరే తోయిబా టాప్ కమాండర్ సైఫుల్లా సాజిద్ జట్ హస్తం ఉండొచ్చని జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి. పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన సాజిద్‌ను సైఫుల్లా కసూరీగానూ పిలుస్తారు. NIA ఇతడిని కఠినమైన ఉగ్రవాదిగా పేర్కొంది. ప్రస్తుతం ఇస్లామాబాద్ నుంచి ఇతడు ఆపరేషన్స్ చేపడుతున్నట్లు తెలుస్తోంది. పాకిస్థానీ ISI, ఆర్మీతో ఇతడికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.